Hanuman : ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో ‘హనుమాన్’ రిలీజ్.. డేట్ అనౌన్స్!

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న టీజర్ 'హనుమాన్'. టాలీవుడ్ లోని ఒక యువ దర్శకుడు, ఒక యువ హీరో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా టీజర్ ముందు వరకు ఎటువంటి అంచనాలు లేవు. ఈ సినిమాపై నార్త్ లో కూడా ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమా కేవలం పాన్ ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.

Hanuman : ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో ‘హనుమాన్’ రిలీజ్.. డేట్ అనౌన్స్!

Hanuman movie will be released in 11 languages in world wide

Hanuman : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న టీజర్ ‘హనుమాన్’. టాలీవుడ్ లోని ఒక యువ దర్శకుడు, ఒక యువ హీరో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా టీజర్ ముందు వరకు ఎటువంటి అంచనాలు లేవు. అయితే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్ లో కనిపించని విజువల్స్ ‘హనుమాన్’ టీజర్ లో కనిపించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాపై నార్త్ లో కూడా ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమా కేవలం పాన్ ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.

Hanuman: అండర్‌వాటర్‌లో హనుమాన్ అడ్వెంచర్.. మామూలుగా ఉండదట!

ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తూన్న ఈ చిత్రంలో హీరోగా తేజ సజ్జ నటిస్తున్నాడు. భారతీయ ఇతిహాసాల్లో రామభక్తుడిగా అందరికి తెలిసిన హనుమంతుడిని ప్రపంచదేశాలకు సూపర్ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కాగా ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో ‘హనుమాన్’ రిలీజ్ కానుంది. మే 12న పాన్ వరల్డ్ వైడ్ థియేటర్ లో సందడి చేయనున్నట్లు చిత్ర బృందం నేడు అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాతో ఒక కొత్త సూపర్ హీరో యూనివర్స్ కి తెర లేపుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. భారతీయ ఇతిహాసంలోని దేవుడాలను సూపర్ హీరోలుగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మరి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే దేవతల రాజు అయిన ‘ఇంద్రుడు’ క్యారెక్టర్ తో ‘అదిరా’ చిత్రం తెరకెక్కబోతుంది. కాగా హనుమాన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇవాళ రిలీజ్ చేసిన వీడియో అండ్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. హనుమంతుడి రూపాని వరల్డ్ మ్యాప్ లో చూపించిన ప్రశాంత్ వర్మ విజన్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.