హ్యాపీ బర్త్‌డే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 55వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్..

  • Published By: sekhar ,Published On : March 14, 2020 / 08:58 AM IST
హ్యాపీ బర్త్‌డే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 55వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్..

ఎటువంటి క్యారెక్టర్ చేసినా అందులో తన మార్క్ కనబడేలా.. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పుట్టినరోజు నేడు(మార్చి 14).. 1973లో ‘యాదోం కి బారాత్’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన ఆమిర్.. తర్వాత హీరోగా ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలూ చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

Happy Birthday Aamir Khan

రొటీన్‌కి భిన్నంగా, సినిమా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో సామాజిక అంశాలతో రూపొందే కథల ద్వారా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. పాత్ర కోసం వయసుతో సంబంధం లేకుండా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్.. ఇలా తనను తాను సాన బెట్టుకుంటారాయన..

Happy Birthday Aamir Khan

ప్రస్తుతం హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నటిస్తున్నారు. ఆమిర్ 55వ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అజయ్ దేవ్‌గణ్, ఆయుష్మాన్ ఖురానా, జూహీ చావ్లా, మాధురీ దీక్షిత్ వంటి పలువురు బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోలను ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆమిర్ ఖాన్. 

See Also |  దమ్ముంటే నన్నాపు.. కాదు కరోనాను ఆపు..