HappyBithdayNTR : జూనియర్ ఎన్టీఆర్..ఆసక్తికర విషయాలు

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 04:19 AM IST
HappyBithdayNTR : జూనియర్ ఎన్టీఆర్..ఆసక్తికర విషయాలు

యాక్టింగ్, డైలాగ్, డ్యాన్సుల్లో అదుర్స్ అనిపిస్తున్నాడు. డిఫెరెంట్ కేరేక్టర్లు చేస్తూ..అభిమానులను అలరిస్తున్నాడు. ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ..తనదైన సినిమాలు చేస్తూ..అదరగొడుతున్నాడు..అతనే జూనియర్ ఎన్టీఆర్. మే 20 ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు బర్త్ డే విషెస్ చేబుతున్నారు. Twitter లో #HappyBithdayNTR హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక..జూ.ఎన్టీఆర్ విషయానికి వస్తే…

నందమూరి వారసునిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఎన్టీఆర్‌ తన ఫస్ట్ మూవీ నుంచే ఆ స్టేచర్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. స్టూడెంట్‌ నెంబర్‌ 1 సినిమాతో యూత్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ మాస్‌ హీరోగానే కాకుండా క్లాస్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో ఫ్లాపులతో, ఆఫ్లాపుల్ని తలదన్నే హిట్స్ తో  బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో రీసెంట్ టైమ్స్ ‌లో ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉన్న హీరోగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు.

ntr

ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నటుడు. అయితే ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఫ్లాపుల తర్వాత రియలైజ్ అయిన ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇనీషియల్ స్టేజ్ లోనే ఎన్నో ప్రయోగాలు చేశాడు. యంగ్ ఏజ్ లోనే ఆది ,సింహాద్రి లాంటి భారీ క్యారెక్టర్స్ క్యారీ చేశాడు. సింహాద్రి లాంటి భారీ మాస్‌ యాక్షన్‌ క్యారెక్టర్ తరువాత మామూలు సినిమాల్లో ఎన్టీఆర్‌ ను చూడలేకపోయారు అభిమానులు.. దీంతో చాలా కాలం ఎన్టీఆర్‌ ఫ్లాప్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. సింహాద్రి తర్వాత డిఫరెంట్ జానర్ ట్రై చేశాడు. యమదొంగ లాంటి భారీ సక్సెస్ తరువాత మరోసారి తడబడ్డాడు జూనియర్. అట్టర్ ఫ్లాప్ మూవీ కంత్రి విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నాడు జూనియర్. అందుకే అదుర్స్ సినిమాతో అభిమానులను ఖుషీ చేశాడు. 

కేవలం మాస్‌ సినిమాలే కాకుండా బృందావనం లాంటి ఫ్యామిలీ స్టోరితో కూడా మెప్పించి తను ఎలాంటి క్యారెక్టర్‌ అయిన చేయగలనని నిరూపించుకున్నాడు. బృందావనం సినిమా తరువాత ఎన్టీఆర్ కెరీర్ మరోసారి గాడి తప్పింది. కథ ఎంపికలో ఎన్టీఆర్ చేసిన తప్పులు ఆయన కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. శక్తి తరువాత కూడా కథ ఎంపికలో పొరపాట్లు చేశాడు ఎన్టీఆర్. తన బాడీలాంగ్వేజ్ కు అస్సలు సూట్ అవ్వని ఊసరవెళ్లితో పాటు తన ఏజ్ కు ఇమేజ్ కు మించిన దమ్ము సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు.

ntr2

బాద్ షా సినిమాతో కాస్త పరవాలేదనిపించిన ఎన్టీఆర్ మరోసారి రామయ్య వస్తావయ్య, రభస సినిమాలతో నిరాశపరిచాడు. మూస మాస్ దోరణి సినిమాలు చేయకుండా ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. వరుస ఫ్లాప్ లతరువాత ఎన్టీఆర్ కెరీర్ ను గాడిలో పెట్టిన సినిమా టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త స్టైల్ ఇలా ప్రతీ విషయంలో కొత్తదనం చూపించిన జూనియర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సత్తా చాటాడు.

టెంపర్ తరువాత కూడా ప్రయోగాలను కంటిన్యూ చేశాడు జూనియర్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో మరో కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో తొలిసారిగా 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు జూనియర్. అదే ఫాంను కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ సెటిల్డ్ పర్ఫామెన్స్ నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ 80 కోట్ల వసూళ్లతో టాప్ స్టార్ ప్లేస్ ఇచ్చింది.

తర్వాత వచ్చిన జై లవ కుశ సినిమాతో తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేయటంతో పాటు పూర్తి స్థాయి నెగెటివ్  రోల్ చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా కూడా  సూపర్ హిట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చి న అరవిందసమేత తో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రాజమౌళితో మరోసారి సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ లో రామ్ చరణ్ తో పాటు మల్టీస్టారర్ సినిమా చేస్తూ… ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ మరోహిట్ కి ఎయిమ్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, వీడియో వచ్చేస్తోంది