Vaisshnav Tej : హ్యాపీ బర్త్‌డే పంజా వైష్ణవ్ తేజ్..

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త సినిమాలు ప్రకటించారు..

Vaisshnav Tej : హ్యాపీ బర్త్‌డే పంజా వైష్ణవ్ తేజ్..

Vaisshnav Tej

Vaisshnav Tej: పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు.

Chiru-Jagan Meet: జగన్‌తో చిరంజీవి లంచ్ మీట్.. టికెట్ల వివాదానికి ఎండ్ కార్డ్?

తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. జనవరి 13 వైష్ణవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాభిమానులు, ఇండస్ట్రీవారు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

Pushpa Movie : ‘సామీ సామీ’ సాంగ్‌కి నేపాల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా!

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ ని తమిళ్‌లో తెరకెక్కించిన గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ మూడో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చెయ్యనున్నారు.

అలాగే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకుడు త్రివిక్రమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం.16 లో కూడా వైష్ణవ్ హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు.