Sanjay Dutt : హ్యాపీ బర్త్‌డే ‘అధీరా’..

సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన చేస్తున్న పవర్‌ఫుల్ ‘అధీరా’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం..

Sanjay Dutt : హ్యాపీ బర్త్‌డే ‘అధీరా’..

Sanjay Dutt

Sanjay Dutt: వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’.. కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్’ కి సీక్వెల్‌గా.. రాకింగ్ స్టార్ యష్ , ప్రశాంత్ నీల్ కాంబోలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

KGF 2 : రాఖీ భాయ్ రఫ్ఫాడిస్తున్నాడు..

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవీనా టాండన్, ఈశ్వరీ రావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేస్తున్న ‘అధీరా’ రోల్ ఈ సినిమాలో హైలెట్‌ కానుంది.

Sanjay Dutt

గురువారం(జూలై 29) సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన చేస్తున్న పవర్‌ఫుల్ ‘అధీరా’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. కళ్లద్దాలు పెట్టుకుని, చేత్తో పొడవాటి తల్వార్ పట్టుకుని గంభీరంగా ఉన్న సంజూ బాబా లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్‌లో ‘కె.జి.యఫ్ 2’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Surrogacy : బాలీవుడ్ సరోగసి సినిమాలు..