SS Rajamouli: జక్కన్న మీద RRR టీమ్ కంప్లైంట్స్!

  • Published By: sekhar ,Published On : October 10, 2020 / 02:14 PM IST
SS Rajamouli: జక్కన్న మీద RRR టీమ్ కంప్లైంట్స్!

RRR – SS Rajamouli: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన దర్శకధీరుడు SS Rajamouli పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ప్రస్తుతం స్వాతంత్య్ర నేపథ్యంలో ఎన్టీఆర్ ను కొమురంభీంగా, రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజుగా చూపిస్తూ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా RRR – రౌద్రం రణం రుధిరం సినిమాను తెరకెక్కిస్తున్నారాయన.


జక్కన్న జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా RRR టీమ్ రాజమౌళికి విషెస్ చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.


తారక్, చెర్రీ, కీరవాణి, సెంథిల్, సాబు సిరిల్, నిర్మాత దానయ్యతో పాటు RRR మూవీకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్న వారు జక్కన్న మీద కంప్లైంట్స్ చేస్తూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. కొమరం భీమ్ పుట్టినరోజు (జయంతి) సందర్భంగా #RamarajuforBheemOnOct22 వీడియో విడుదల చేయనున్నారు.