టబూ సింగిల్ గా ఉండిపోవడానికి అజయ్ దేవగన్‌యే కారణమట

టబూ సింగిల్ గా ఉండిపోవడానికి అజయ్ దేవగన్‌యే కారణమట

Tabu: సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ టబు తన 50వ పుట్టిన రోజును బుధవారం జరుపుకుంటున్నారు. మీరా నాయర్ డైరక్షన్ లో వస్తున్న సైదా భాయ్ సినిమాకు ఇప్పటి నుంచే కాంప్లిమెంట్స్ అందుకుంటున్న టబు.. సింగిల్ గా ఉండిపోవడం వెనుక కారణం అజయ్ దేవగణ్‌యే అంటోంది.

స్క్రీన్ మీద బడా హీరోలతో లవ్ స్టోరీల్లో కనిపించిన టబు.. షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి వాళ్లతో కలిసి చక్కటి జోడి అనిపించుకుంది. తనకు అజయ్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అది ఆమెను సింగిల్ గా మిగిలిపోయేందుకు కారణాలు చెప్పింది.



ఒకానొక ఇంటర్వ్యూలో టబు.. అజయ్ గురించి ఇలా చెప్పింది. అజయ్ తన కజిన్ సమీర్ ఆర్యాతో కలిసి ఎప్పుడూ ప్రొటెక్టివ్‌గా చూసుకునేవాడట.

‘అజయ్.. నాకూ 13.. 14ఏళ్ల వయస్సు అప్పటి నుంచి తెలుసు. అతను నా బ్రదర్ చిన్నప్పటి ఫ్రెండ్. మేమంతా జుహూలో ఒకే లొకాలిటీలో కలిసి పెరిగాం. వాళ్లంతా ఓ గ్యాంగ్ లో తిరిగేవాళ్లు. మేం వాళ్లను ఆటపట్టించడానికి ఫాలో అవుతుండేవాళ్లం’

‘ఇంకా అజయ్, సమీర్ మాత్రం నాపైనే ఫోకస్ పెట్టేవాళ్లు. ఎవరైనా అబ్బాయిలు నాతో మాట్లాడటానికి వస్తే వాళ్లను కొట్టేవారు. ఇప్పుడు వాళ్లంతా ఫ్యామిలీలు అయిపోయారు నేను సింగిల్‌గా ఉండిపోయా. అతను చేసింది ఇప్పుడు అర్థం అయి ఉండొచ్చు’ అని నవ్వేసింది టబు.

ఒకరోజు అజయ్‌కు చెప్పా. నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అబ్బాయి ఉంటే చూడమని. జోకులు పక్కకుపెట్టి మా రిలేషన్‌షిప్ గురించి మాట్లాడాలంటే.. కలిసి పనిచేశాం. నాతో పనిచేసిన హీరోలలో అజయ్ నాకు బాగా క్లోజ్. అతను చాలా ప్రొటెక్టివ్. సెట్ లో ఉంటే ప్రొటెక్టివ్ గా ప్రశాంతంగా ఉంటుంది.

అజయ్-టబు కాంబినేషన్లో దే దే ప్యార్ దే, దృశ్యం, గోల్‌మాల్ అగైన్, విజయ్‌పథ్, హఖీఖత్ లాంటి హిట్ మూవీస్ వచ్చాయి.