V V Vinayak : మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్..

తెరపై హీరోయిజాన్నిఎలివేట్ చెయ్యడంలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టినరోజు స్పెషల్..

V V Vinayak : మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్..

Happy Birthday V V Vinayak

V V Vinayak: తన స్టైల్ ఫిలిం మేకింగ్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వి.వి. వినాయక్. అక్టోబర్ 9న వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలు చూద్దాం..

V V Vinayak

 

సీనియర్ డైరెక్టర్ సాగర్ దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన వినాయక్.. జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో బాలకృష్ణను సరికొత్తగా చూపిస్తూ రెండో సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’ చేశారు. తన కెరీర్‌లో బెస్ట్ వర్క్ ఇదేనని చెప్తుంటారు వినాయక్.

Sagar

 

హీరోగా నితిన్ రెండో సినిమా ‘దిల్’ వినాయక్‌కు మూడో సినిమా. ‘దిల్’ తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన రాజు ఈ సినిమా నుండి దిల్ రాజుగా మారడం వెనుక వినాయక్ పాత్ర కీలకం. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

Aadi

నాలుగో సినిమాగా తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’ తీసి సూపర్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఎన్టీఆర్‌ని ‘సాంబ’ గా, అల్లు అర్జున్‌ని ‘బన్నీ’ గా, విక్టరీ వెంకటేష్‌ను ‘లక్ష్మీ’ గా, ప్రభాస్‌ను ‘యోగి’ గా చూపించారు. హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడంలో వినయ్ స్టైలే వేరు. ఈ హీరోల కెరీర్‌లో మాస్ సినిమాల లిస్టులో ఈ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి.

Vinayak

తన స్టైల్ యాక్షన్‌కి కామెడీ జోడించి రవితేజతో ‘కృష్ణ’, ఎన్టీఆర్‌తో (మూడో సినిమా) ‘అదుర్స్’ తీసి అలరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘నాయక్’, బెల్లంకొండ సురష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ ఫిలిం ‘అల్లుడు శీను’, మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం.150’ తో తన సత్తా చూపించారు.

Chiru

 

భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్‌తో చేసిన ‘బద్రీనాథ్’, అఖిల్ అక్కినేని ఇంట్రో ఫిలిం ‘అఖిల్’, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో తీసిన ‘ఇంటిలిజెంట్’ సినిమాలు వినాయక్‌కు దర్శకుడిగా ఫ్లాఫ్స్ ఇచ్చాయి. తాను నిర్మాతగా పరిచయం చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో వినాయక్ హీరోగా ‘సీనయ్య’ సినిమాతో ఇంట్రడ్యూస్ అవాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్.. ఇప్పుడు శ్రీనుతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ద్వారా దర్శకుడిగా తాను కూడా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.

Bellamkonda