Hardik Pandya : ‘పుష్ప’ ఫీవర్.. నానమ్మతో కలిసి స్టెప్పులేసిన హార్దిక్ పాండ్య

ఇప్పటికే మన ఇండియన్ క్రికెటర్స్ తో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా 'పుష్ప' సినిమాలోని పాటలకు, డైలాగ్స్ కి రీల్స్ చేసి తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా.......

Hardik Pandya : ‘పుష్ప’ ఫీవర్.. నానమ్మతో కలిసి స్టెప్పులేసిన హార్దిక్ పాండ్య

Allu Arjun

Pushpa :  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా ఫీవర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటినా ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఒక పక్క తగ్గేదేలే అంటూ డైలాగ్స్, మరో పక్క పుష్ప సాంగ్స్ తో రీల్స్ సోషల్ మీడియాని షేక్ ఆడిస్తున్నాయి. కేవలం అభిమానులే కాదు, దేశ విదేశాల్లో సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, స్టార్‌ క్రికెటర్లు.. ఇలా అందరూ పుష్ప పాటలతో, డైలాగ్స్ తో రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. శ్రీవల్లి సాంగ్, ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్, తగ్గేదెలా డైలాగ్స్ కి సంబంధించిన రీల్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Puneeth Rajkumar : పునీత్ చివరి చిత్రం.. కన్నడ డిస్ట్రిబ్యూటర్ల గొప్ప నిర్ణయం..

ఇప్పటికే మన ఇండియన్ క్రికెటర్స్ తో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ‘పుష్ప’ సినిమాలోని పాటలకు, డైలాగ్స్ కి రీల్స్ చేసి తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ కూడా పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌కు చిందేసింది. ఇంతకీ ఈ ముసలావిడ ఎవరో అనుకుంటున్నారా?.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య తన నానమ్మతో కలిసి ఇలా ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి సాంగ్ కి స్టెప్పులేశాడు. ఆ ఏజ్ లో మనవడితో కలిసి స్టెప్పులేయడంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేసి.. “అవర్‌ ఓన్‌ పుష్ప నాని” అంటూ హార్ధిక్‌ పాండ్య పోస్ట్‌ చేసి అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరల్ అవుతుంది. నెటిజన్లు హార్దిక్ బామ్మ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.