Hareesh Shankar : రామ్‌కి లవ్ స్టోరీ చెప్పాను వద్దన్నాడు.. రామ్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది..

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''దేవదాస్ సినిమా నుంచి రామ్ అంటే నాకు ఇష్టం. గతంలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఓ సారి రామ్‌కి..............

Hareesh Shankar : రామ్‌కి లవ్ స్టోరీ చెప్పాను వద్దన్నాడు.. రామ్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది..

Hareesh Shankar

The Warrior :  రామ్‌ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వారియర్‌’. జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని అలరించి సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మొదటి సారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ”దేవదాస్ సినిమా నుంచి రామ్ అంటే నాకు ఇష్టం. గతంలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఓ సారి రామ్‌కి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చెప్పాను. కథ విన్నాక రామ్.. నా మైండ్లో ఫ్యాన్ మూడో నంబర్లో తిరుగుతోంది. కానీ మనం సినిమా చేస్తే ఐదో నంబర్లో తిరిగాలి అని అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికి గుర్తుంది. రామ్‌తో కచ్చితంగా సినిమా చేస్తాను. కానీ అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేను” అని తెలిపారు.

Anchor Suma : సుమ వల్లే నేను బతుకుతున్నాను.. సీనియర్ నటి కన్నీళ్లు..

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ సినిమా ఉంటుంది అని ప్రకటించడంతో రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ ది వారియర్ తర్వాత బోయపాటితో సినిమా చేయబోతున్నాడు. హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అయిన తర్వాత రామ్ – హరీష్ శంకర్ సినిమా ఉండొచ్చని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.