Hareesh Shankar : పవన్ ఫ్యాన్స్ పైన సీరియస్ అయిన హరీష్ శంకర్..

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''మీ అందరికి ఒక రిక్వెస్ట్. కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటి చెప్తారు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే ఫ్యామిలీ. అయన అలా చెప్పారు కాబట్టే................

Hareesh Shankar : పవన్ ఫ్యాన్స్ పైన సీరియస్ అయిన హరీష్ శంకర్..

Hareesh Shankar

Hareesh Shankar :  నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

 

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ”మీ అందరికి ఒక రిక్వెస్ట్. కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటి చెప్తారు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే ఫ్యామిలీ. అయన అలా చెప్పారు కాబట్టే ఇవాళ ఇలా ఫంక్షన్ కి వచ్చారు. మీరు ఇలాగే అరిచి వేరే సినిమాల ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ గారు వస్తే వేరే ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు ఇలా అరవకండి. వారికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇలా చేస్తే ఆయన ఫంక్షన్లకి రావడం మానేస్తారు. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అయినా గబ్బర్ సింగ్ కి మించి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఇది అంటే సుందరానికి సినిమా ఫంక్షన్, నాని ఫంక్షన్. దాని గురించి మాట్లాడుకుందాం.

 

Buchhibabu : మా ఊర్లో రెండే ఫేమస్.. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

ఈ సినిమా నిన్న చూశాను. చాలా బాగుంది. వివేక్ డైరెక్టర్ బాగా రాసాడు సినిమాని. సినిమా చూశాక నానిని మర్చిపోతారు సుందరమే గుర్తుంటారు. ఈ సినిమాని తప్పక చూడండి. నలిగిపోయిన పాత్రలో నాని, నజ్రియా. నలిపేసే పాత్రలో నదియా, నరేష్ గారు. మిగిలిన ఆర్టిస్టులంతా బాగా చేశారు. బామ్మ గారు మరిన్ని సినిమాల్లో కనిపిస్తారు. నజ్రియాని రాజారాణి నుంచి చూస్తున్నాము. పెద్ద మనషుల గురించి, పెద్ద మనసుల గురించి ఈ సినిమా. మంచి సినిమాలు, మంచి ట్యాలెంట్ ఎక్కడున్నా పవన్ గారు ఎంకరేజ్ చేస్తారు. అందుకే ఇవాళ కూడా వచ్చారు. గెలుపు కోసం పరిగెత్తేవాడు గెలిచినా తర్వాత ఆగిపోతాడు. ధర్మం కోసం నిలబడ్డవాడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అలాగే నిలబడతాడు. గెలుపు శాశ్వతం కాదు, ధర్మం శాశ్వితం. పవన్ గారు ఆ ధర్మం గురించి నిలబడ్డారు కాబట్టే పవన్ కళ్యాణ్ మన గుండెల్లో ఉన్నారు” అని తెలిపారు.