Pawan Kalyan : పవన్ కోసమే ఎదురు చూస్తున్న హరీష్ శంకర్.. భవదీయుడు ఎప్పుడు పట్టాలెక్కేనో??

భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కించడం కోసం కల్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు హరీశ్ శంకర్. గద్దల కొండ గణేశ్ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని............

Pawan Kalyan : పవన్ కోసమే ఎదురు చూస్తున్న హరీష్ శంకర్.. భవదీయుడు ఎప్పుడు పట్టాలెక్కేనో??

Pawan Kalyan

Hareesh Shankar :  నాక్కొంచెం తిక్కుంది కాని దానికో లెక్కుంది. నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా. పదేళ్ల క్రితం ఈ డైలాగ్ చెప్పినా ఇప్పటికీ ఆ పవర్ ఫుల్ డైలాగ్ ఇంపాక్ట్ అలాగే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చి ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చింది. మళ్లీ ఆ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్, ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. భీమ్లానాయక్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక పక్క పాలిటిక్స్, మరో పక్క సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఫుల్ బిజీ మోడ్ లో వర్క్ చేస్తున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్న పవన్, ఆ నెక్ట్స్ ప్రాజెక్ట్ సముద్రఖనితోనా, హరీశ్ శంకర్ తోనా కన్ఫామ్ చేయకుండా నాన్చారు. దాంతో హరీశ్ కూడా ఒకింత ఆందోళనకి గురయ్యారు ఆ మధ్య. లేటెస్ట్ గా అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో స్వయంగా పవనే క్లారిటీ ఇచ్చి, హరీశ్ శంకర్ కి ఊపిరి పోశారు.

భవదీయుడు భగత్ సింగ్ పైన పక్కా క్లారిటీ అయితే వచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో భగత్ సింగ్ అంటే అంచనాలు అమాంతం పెంచేసుకుంటారు అభిమానులు. కొన్ని కొన్ని సార్లు రావడం లేటవ్వచ్చునేమో గాని, మరి ఆ అంచనాలను రీచ్ అవ్వడం మాత్రం పక్కా అన్నంత రేంజ్లో హరీశ్ శంకర్ ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఈ సినిమా గురించి మరో పది సంవత్సరాలు చెప్పుకునేలా ఉంటుందని పవన్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చేసి, ఫుల్ ఖుషీ చేశారు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.

Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??

భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కించడం కోసం కల్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు హరీశ్ శంకర్. గద్దల కొండ గణేశ్ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని, ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ క్యారెక్టర్ ను ఫన్ అండ్ పవర్ ఫుల్ గా ఢీల్ చేసిన ఆయన, ఈ సినిమాలో పవన్ ను ప్రొఫెసర్ క్యారెక్టర్ లో ఢీల్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

అంతే కాదు, ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చినా హరీష్ వాటిని ఖండించారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసి, పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ఢీల్ చేయాలని చూస్తున్నారు హరీశ్. భవదీయుడు భగత్ సింగ్ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ను జులై లేదా ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో త్వరలోనే రివీల్ కానున్నాయి.