హరితేజ – శ్రేయా ఘోషల్ ‘బేబి బంప్‌’..

హరితేజ – శ్రేయా ఘోషల్ ‘బేబి బంప్‌’..

Hari Teja – Shreya Ghoshal: సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ బేబి బంప్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.. తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గానూ ప్రేక్షకులను అలరించిన హరితేజ ఇటీవల జరిగిన తన సీమంతం ఫంక్షన్‌లో బేబీ బంప్‌తో డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న పిక్స్, వీడియోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

హరితేజ సీమంతం.. బేబీ బంప్‌తో డ్యాన్స్..

తెలుగుతో పాటు పలు భాషల్లో తన మధురమైన గొంతుతో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తున్న ‘మెలోడి క్వీన్’ శ్రేయా ఘోషల్ తను గర్భవతిగా ఉన్నానని చెబుతూ బేబీ బంప్‌తో ఉన్న పిక్ షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

త్వరలో మా జీవితంలోకి బేబీ శ్రేయా ఆదిత్య ప్రవేశించనుందని, ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. హరితేజ, శ్రేయా ఘోషల్ ఇద్దరికీ బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.