HariHara Veeramallu : హరిహర వీరమల్లు టీజర్ ఆ రోజేనా? పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు. ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా................

HariHara Veeramallu : హరిహర వీరమల్లు టీజర్ ఆ రోజేనా? పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్??

HariHara Veeramallu teaser will releasing on republic day

HariHara Veeramallu :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు. ఇప్పటికే రెండేళ్లుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి వచ్చిన ఫొటోస్, పవన్ లుక్, సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటు క్యారెక్టర్ చేయనున్నట్టు, మొఘల్ రాజుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మరో బాలీవుడ్ నటి, మరింతమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు ఈ సినిమాలో. నిర్మాత AM రత్నం హరిహర వీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ లో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Suhas : పోకిరి టికెట్ల కోసం చొక్కా చిరిగిపోయింది.. ఇప్పుడు నేనే చింపేసుకుంటా.. మహేష్ ట్వీట్‌కి సుహాస్ రిప్లై

నిర్మాత AM రత్నం తన సన్నిహితుల వద్ద హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే రోజు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారంట. ఇదే కనక నిజమైతే పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉంటారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి రిపబ్లిక్ డే రోజు హరిహర వీరమల్లు టీజర్ వచ్చి అభిమానులకి ట్రీట్ ఇస్తుందేమో చూడాలి. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ – బాలయ్య ఎపిసోడ్ ని కూడా రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు అభిమానులు. ఒకవేళ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కూడా అదే రోజు రిలీజ్ అయితే పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి పవన్ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్స్ వస్తాయో రిపబ్లిక్ డే రోజు.