Ustaad Bhagat Singh : ఉస్తాద్‌లో పవన్‌కి విలన్‌గా మంత్రి మల్లారెడ్డి.. బ్రతిమాలిన హరీష్ శంకర్!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కే 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ గా తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని (Mallareddy) సెట్ చేస్తున్న దర్శకుడు.

Harish Shankar cast Minister Mallareddy as Villain in Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుండగా, నిన్నటితో (మార్చి 25) ఒక సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి పవన్ నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుంది. దీంతో ముందుగా పవన్ టాకీ పోర్షన్ పూర్తి చేసేశారు. ఇక ఏప్రిల్ 5 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు.
PKSDT : వినోదయ సిత్తం షూటింగ్ పూర్తి చేసిన పవన్..
గతంలో వీరిద్దరి మధ్య వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి నుంచి ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. తేరి సినిమాలో విలన్ గా మహేంద్రన్ కనిపించాడు. ఈ పాత్ర కోసం హరీష్ శంకర్ తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని (Mallareddy) సంప్రదించాడని మల్లారెడ్డి స్వయంగా తెలియజేశాడు.
Pawan Kalyan – Sai Dharam Tej : కలెక్షన్స్ సునామీ సృష్టించడానికి డేట్ ఫిక్స్ చేసిన మామ అల్లుడు..
ఈమధ్య కాలంలో మల్లారెడ్డి.. ‘కష్టపడ్డా, పని చేసిన’ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హరీష్ శంకర్ మల్లారెడ్డి ఇంటికి వెళ్లి వైరల్ అవుతున్న మాటలు గురించి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రలో బాగా ఫేమస్ అయ్యిపోయావు అన్నా. పవన్ కళ్యాణ్ తో నేను తీసే సినిమాలో విలన్ గా నటిస్తావా అన్నా అని అడిగాడట. అంతేకాదు దాదాపు గంట బ్రతిమాలాడట. అయితే చివరికి మల్లారెడ్డి ఏ సమాధానం చెప్పాడు అన్నది తెలియజేయలేదు.