Harish Shankar : ఆ రిపోర్టర్ పై హరీష్ శంకర్ ఫైర్.. మరోసారి రిపోర్టర్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేఖరులతో ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటి..

Harish Shankar : ఆ రిపోర్టర్ పై హరీష్ శంకర్ ఫైర్.. మరోసారి రిపోర్టర్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

Harish Shankar counter to Suresh Kondeti

Suresh Kondeti :  ఇటీవల పలు సినిమా ప్రెస్ మీట్స్ లో ప్రముఖ సినిమా జర్నలిస్ట్, PR సురేష్ కొండేటి హీరోలు, హీరోయిన్స్ ని ఉద్దేశించి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ ఓ పక్క వైరల్ అవుతూనే మరో పక్క వివాదాల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు సినిమా జర్నలిస్ట్ గా, సంతోషం మ్యాగజైన్, అవార్డ్స్ తో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సురేష్ కొండేటి ఇటీవల సినిమా ప్రెస్ మీట్స్ లో హీరో, హీరోయిన్స్ ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా మరోసారి ఇదే స్టంట్ చేయబోయి డైరెక్టర్ హరీష్ శంకర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేఖరులతో ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటి.. 2018 సినిమా చూసిన తర్వాత తెలుగు దర్శకులు అలాంటి సినిమాలు తీయగలరా? తెలుగు నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీసే సాహసం చేయగలరా? డబ్బింగ్ సినిమా ఇక్కడ ఆడుతుందా? మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుందా అని పలు ప్రశ్నలు అడిగారు.

దీనికి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ప్రెస్ మీట్స్ జరిగిన ప్రతిసారి సురేష్ కొండేటి ఎవరూ అడగని ఓ ప్రశ్న అడిగేసి వైరల్ అవుతున్నారు. వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అవుతాడు. మన తెలుగు సినిమా ప్రపంచమంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి టెక్నాలజీలో ఉన్నాం మనం. మీరు ఇంకా డబ్బింగ్ సినిమా అంటారేంటి. RRR, బాహుబలిని హిందీ వాళ్ళు డబ్బింగ్ అనుకున్నారా? డబ్బింగ్, రీమేక్ సినిమా అనేది ఏమి లేవు. సినిమా అంతే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమా ఎక్కడిదాకా అయినా వెళ్తుంది బాగుంటే. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంటే మీరు ఇలాంటి ప్రశ్న అడగటం జాలి వేస్తుంది మీ మీద. నేను అది కేరళ సినిమాగా చూడలేదు, కేరళ డైరెక్టర్ గా చూడలేదు. సినిమా నాకు నచ్చింది, డైరెక్టర్ వర్క్ నచ్చింది. అందుకే ఈ ప్రెస్ మీట్ కి వచ్చాను అని అన్నారు.

అలాగే అదే రిపోర్టర్ గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకు పరిమితమైపోతుందా అని అడిగారు. దీనికి కూడా హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు నేనే బన్నీవాసుతో రిలీజ్ చేయిస్తాను. అందులో తప్పేముంది. ఒక మంచి సినిమాని పది మందికి చూపించాలని బన్నీ వాసు అనుకున్నారు. డబ్బింగ్ సినిమానా లేక రీమేక్ సినిమానా అని కాదు మంచి సినిమా ప్రేక్షకులకు ఇస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. భాషా పరమైన వ్యత్యాసాలు ఇప్పుడు సినిమాకు లేవు. సినిమా అంటేనే ఒక భాష. సినిమాకు భాషతో సంబంధం లేదు అని అన్నారు.

Upasana : చిరంజీవి చెప్పారని ఉపాసన ఫోన్ చేశారు.. షాక్ అయ్యానంటున్న పొన్నంబలం!

ఆ తర్వాత దీనిపై హరీష్ శంకర్ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేయడం విశేషం. గతంలో ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు నెటిజన్లు సురేష్ కొండేటిని ట్రోల్ చేశారు. అయినా మారకుండా మళ్లీ ఇలాగే అడగడంతో పాటు హరీష్ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మరోసారి సురేష్ కొండేటిని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.