Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?

తెలుగు దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్......

Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?

Harish Shankar Decides For A Film With Allu Arjun Once Again

Harish Shankar: తెలుగు దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాలు అందుకోవడం ఖాయమనే ముద్ర పడిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకు ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన ఘనత కూడా ఈ డైరెక్టర్ సొంతం. అయితే గతకొంత కాలంగా ఆ రేంజ్‌‌లో హిట్ అందుకోలేకపోయాడు ఈ డైరెక్టర్. దీంతో ఇప్పుడు మరోసారి పవర్ స్టార్‌తో కలిసి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Harish Shankar: మరోసారి ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న హరీష్ శంకర్

ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ నెల నుండి పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈలోపే ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్‌తో చేస్తున్న భవదీయుడు భగత్‌సింగ్ ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టుకోలేదు. దీంతో ఈ సినిమా అక్టోబర్‌లోపు పూర్తి కావడం అసంభవం అని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టాలని దర్శకుడు హరీష్ శంకర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Harish Shankar: సల్మాన్ కోసం హరీష్ స్క్రిప్ట్.. త్వరలోనే ఫైనల్ చర్చలు?

ఇక ఈ సమయంలో ఖాళీగా ఉండే హరీష్ శంకర్, తనకు ‘డీజే-దువ్వాడ జగన్నాధం’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఆయన గతంలో బన్నీకి ఓ స్టోరీలైన్ వినిపించగా, ఇప్పుడు మరోసారి అదే కథను ఆయనకు వినిపించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి పవన్ సినిమాను పక్కనబెట్టి, బన్నీతో సినిమా చేయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అవుతాడా లేడా అనేది చూడాలి.