Harish Shankar : భావోద్వేగంతో రవితేజ కాళ్ళు మొక్కిన హరీష్ శంకర్..

రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చాడు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. 'ఈ రవిశంకర్ లేకపోతే హరీష్ శంకర్ లేడు' అని రవితేజ కాళ్ళు మొక్కాడు.

Harish Shankar : భావోద్వేగంతో రవితేజ కాళ్ళు మొక్కిన హరీష్ శంకర్..

Harish Shankar getting emotional

Harish Shankar : రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. తనలోని మాస్‌ని ఒకప్పటి కామెడీ టైమింగ్‌ని కలిపి రవితేజ డబుల్ ధమాకా ఇస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో, నిర్మాతలు లాభాలు లెక్కపెట్టుకొనే పనుల్లో పడ్డారు. కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న జరిగింది.

Ustaad Bhagat Singh : మొదలైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పనులు..

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చాడు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. ‘రవితేజ గారి అసలు పేరు రవిశంకర్ రాజు. టైమింగ్ అనుకోండి, రైమింగ్ అనుకోండి మీ ఇష్టం కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ రవిశంకర్ లేకపోతే హరీష్ శంకర్ లేడు’ అని కాళ్ళు మొక్కాడు. ఎప్పుడు అయన కొగిలించుకునే నేను, ఇప్పుడు అయన మీద గౌరవం, భక్తి చూపించడానికే కాళ్ళు మొక్కాను అని తెలియజేశాడు.

కాగా హరీష్ శంకర్ మొదటి సినిమా ‘షాక్’ రవితేజతోనే చేశాడు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల హరీష్ రెండో సినిమాకి నిర్మాత నో చెప్పాడు అంటా. ఈ విషయం చెన్నై షూటింగ్ లో ఉన్న రవితేజ తెలుసుకొని, వెంటనే హరీష్ శంకర్ ఫోన్ చేసి.. ‘హరీష్ నీ రెండో సినిమా కూడా రవితేజతోనే ఉండబోతుంది అని వెళ్లి ఆ నిర్మాతకు చెప్పు’ అని చెప్పినట్లు తెలియజేశాడు. ఆ క్రమంలోనే రవితేజతో ‘మిరపకాయ్’ సినిమా చేశాడు హరీష్ శంకర్. తన లైఫ్‌లో 10 ఏళ్ళు రవితేజాతోనే ప్రయాణించా అని, అవే తన జీవితంలో చాలా ముఖ్యమని భావోద్వేగానికి గురయ్యాడు హరీష్ శంకర్.