Harish Shankar : అలాంటి వాళ్లనే బ్లాక్ చేస్తాను.. దానికి నేని రెడీనే.. హరీష్ శంకర్ ట్వీట్..

ఇక హరీష్ శంకర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయానికి స్పందిస్తారు. ప్రతి సినిమా గురించి ట్వీట్ చేస్తారు. అయితే కొంతమంది హరీష్ శంకర్ ని విమర్శించే వాళ్ళు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరీ ట్వీట్స్ చేస్తుండటంతో ఇటీవల అలాంటి వాళ్ళని హరీష్ శంకర్ బ్లాక్ చేస్తున్నాడు.

Harish Shankar : అలాంటి వాళ్లనే బ్లాక్ చేస్తాను.. దానికి నేని రెడీనే.. హరీష్ శంకర్ ట్వీట్..

Harish Shankar said why he blocked some netizens on social media

Harish Shankar : తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక పవన్ అభిమానులకు అయితే హరీష్ దేవుడు అయిపోయాడు. వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు హరీష్ పెద్ద హిట్ ఇవ్వడంతో సినిమా వచ్చి పదేళ్లపైనే అవుతున్నా ఇంకా పవన్ అభిమానులు హరీష్ శంకర్ ని అభిమానిస్తూనే ఉంటారు. ప్రస్తుతం హరీష్ శంకర్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తునారు. ఉస్తాద్ భగత్ సింగ్ అని మరో పవర్ ఫుల్ సినిమాను ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి మరోసారి పవన్ అభిమానుల్లో జోష్ నింపారు.

 

ఇక హరీష్ శంకర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయానికి స్పందిస్తారు. ప్రతి సినిమా గురించి ట్వీట్ చేస్తారు. అయితే కొంతమంది హరీష్ శంకర్ ని విమర్శించే వాళ్ళు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరీ ట్వీట్స్ చేస్తుండటంతో ఇటీవల అలాంటి వాళ్ళని హరీష్ శంకర్ బ్లాక్ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని వార్తలు వచ్చినప్పుడు ఆ రీమేక్ అయితే వద్దు అని పవన్ ఫ్యాన్స్ కూడా కొంతమంది బూతులు తిడుతూ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేయడంతో వాళ్ళని కూడా హరీష్ శంకర్ బ్లాక్ చేశాడు. ఈ విషయంలో పలువురు హరీష్ శంకర్ ని విమర్శిస్తున్నారు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, విమర్శలు తీసుకోలేరా అంటూ హరీష్ కి ట్వీట్స్ చేస్తున్నారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమాలో 10 శాతం షూట్ కూడా కాలేదు.. అప్పుడే ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎందుకు?

తాజాగా హరీష్ శంకర్ దీనికి క్లారిటీ ఇచ్చాడు. ఓ పవన్ అభిమాని.. సారీ అన్నా.. మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాం. గ్లింప్స్ చూసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఒక్క గ్లింప్స్ తో అందరి నోళ్లు మూయించావు. నా ఆనందం మాటల్లో చెప్పలేను అన్నయ్య. మీరు బ్లాక్ చేసిన వాళ్ళందరిని దయచేసి అన్ బ్లాక్ చేయండి అని హరీష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. మనలో మనకు గిల్టీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు. మనమంతా ఒక్కటే. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నేను బూతులు మాట్లాడిన వాళ్ళను మాత్రమే బ్లాక్ చేశాను. విమర్శలను తీసుకోవడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడను అని ట్వీట్ చేశారు. దీంతో హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ గా మారింది.