Harish Shankar : బాలయ్యతో సినిమా తీస్తా అన్న హరీష్ శంకర్.. మరి ఉస్తాద్ భగత్ సింగ్??

తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి వచ్చిన హరీష్ శంకర్ ఈ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా శైలికి, బాలయ్య స్టైల్‌కు చాలా డిఫరెన్స్ ఉన్నా సరే బాలయ్యతో సినిమా చేయాలని ఉంది. అందుకోసం చాలా సీరియస్‌గా...............

Harish Shankar : బాలయ్యతో సినిమా తీస్తా అన్న హరీష్ శంకర్.. మరి ఉస్తాద్ భగత్ సింగ్??

Harish Shankar wants to do a movie with Balakrishna

Harish Shankar :  డైరెక్టర్ హరీష్ శంకర్ ఏ సినిమా వేడుకకు వచ్చినా అక్కడున్న హీరోతో సినిమా చేయాలనుందని, ఆ ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు ఇటీవల. ఇలా గతంలో చాలామంది హీరోలకు కూడా చెప్పిన హరీష్ ఇప్పుడు నందమూరి బాలయ్య కోసం తపించిపోతున్నాడు.

పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ప్రస్తుతం అదే పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ కూడా అయింది. కానీ పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ కేటాయించట్లేదు. దీంతో హరీష్ రెండేళ్ల నుంచి ఖాళీగానే ఉంటున్నాడు.

తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి వచ్చిన హరీష్ శంకర్ ఈ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా శైలికి, బాలయ్య స్టైల్‌కు చాలా డిఫరెన్స్ ఉన్నా సరే బాలయ్యతో సినిమా చేయాలని ఉంది. అందుకోసం చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాను. ‘వీరసింహారెడ్డి’ లాంచింగ్ రోజు తాను అతిథిగా వచ్చి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశాను, అప్పుడే బాలయ్యతో ఫుల్ లెంగ్త్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాన్ని సీరియస్‌గా తీసుకొని బాలయ్య కోసం ఒక కథ రాసి మెప్పించే ప్రయత్నంలో ఉన్నాను. నా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా మా కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మా ప్రయత్నం నెరవేరుతుంది అనుకుంటున్నాను అని అన్నాడు.

ఇదే ఈవెంట్ లో బాలయ్య కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నాతో సినిమా చేస్తా అన్నావు. నాలో కామెడీ టైమింగ్ కూడా ఉంది వాడుకొని రాయి, వర్కౌట్ చేద్దాం అన్నారు. దీంతో ఈ కాంబో కచ్చితంగా జరిగేలాగే ఉందని అంతా భావిస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ యువ డైరెక్టర్స్ కి, తాను అంతకుముందు చేయని డైరెక్టర్స్ కి వరుస అవకాశాలు ఇస్తుండటంతో హరీష్ శంకర్ కి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

Chiranjeevi : 27 అమెరికా నగరాల్లోని ఫ్యాన్స్ తో బాస్ పార్టీ.. వేరే లెవెల్..

ప్రస్తుతం హరీష్ రెండేళ్ల నుంచి పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఏ సినిమా గురించి మాట్లాడలేదు. మరి ఇప్పుడు బాలయ్య ఓకే చెప్తే బాలయ్య సినిమా కోసం వర్క్ చేస్తాడా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయ్యాకే బాలయ్య సినిమాకి వెళ్తాడా? అసలు బాలయ్య హరీష్ కథకి ఓకే చెప్తాడా అని అభిమానులు ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు. కాకపోతే నిర్మాతలు మైత్రి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి హరీష్ ఒక మంచి కథతో బాలయ్యని మెప్పిస్తే కచ్చితంగా వీరి కాంబోలో సినిమా వర్కౌట్ అవుతుంది అని భావిస్తున్నారు అంతా. చూడాలి మరి ఏమవుతుందో.