Hariteja : నీ ఎదవ ఓవర్‌ యాక్టింగ్‌.. నీకు కరోనా రావాలి.. అన్న నెటిజన్ కి దిమ్మతిరిగేలా చేసిన హరితేజ

తాజాగా నిన్న అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌ చేసింది హరితేజ. 'ఇంకేంటి మరి డోలో? సారీ బోలో' అంటూ తనదైన శైలిలో ఇంస్టాగ్రామ్ లో క్వశ్చన్ & ఆన్సర్స్ నిర్వహించింది. దీంట్లో ఓ......

Hariteja : నీ ఎదవ ఓవర్‌ యాక్టింగ్‌.. నీకు కరోనా రావాలి.. అన్న నెటిజన్ కి దిమ్మతిరిగేలా చేసిన హరితేజ

Hariteja

Hariteja :  బిగ్ బాస్ 1తో బాగా ఫేమస్ తెచ్చుకున్న యాంకర్, ఆర్టిస్ట్ హరితేజ ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కొన్ని షోలకి యాంకర్ గాను మెప్పించింది. తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చింది. తల్లిగా మారిన తర్వాత సినిమాలకు కొంచెం దూరం ఉంటుంది. అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనవి, తన భర్త, పాపవి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తుంది.

తాజాగా నిన్న అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌ చేసింది హరితేజ. ‘ఇంకేంటి మరి డోలో? సారీ బోలో’ అంటూ తనదైన శైలిలో ఇంస్టాగ్రామ్ లో క్వశ్చన్ & ఆన్సర్స్ నిర్వహించింది. దీంట్లో ఓ నెటిజన్ ‘నీకు కరోనా పాజిటివ్‌ రావాలి’ అని పోస్ట్ చేయగా దీనికి కోపం తెచ్చుకోకుండా చాలా కూల్ గా హరితేజ స్పందిస్తూ.. ‘మీకు కొంచెం పాజిటివ్‌ యాటిట్యూడ్‌ రావాలి.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక’ అని రిప్లై ఇచ్చింది. ఇలా తనని తిట్టుకునే వాళ్ళని కూడా మంచిగా ఉండాలి అని కోరుకోవడంతో హరితేజ మంచితనాన్ని పొగిడేస్తున్నారు.

Pooja Hegde : కొత్త ఇంట్లో పూజా.. నా కల నెరవేరింది అంటూ..

ఇక మరో నెటిజన్‌.. ‘నువ్వూ.. నీ ఎదవ ఓవర్‌ యాక్టింగ్‌.. ఇంత సీరియస్‌ సిచ్యుయేషన్‌లో కూడా నీ పిచ్చి సిల్లీ జోక్స్‌.. థూ’ అని ఘాటుగానే పోస్ట్ చేయడంతో దీనికి హరితేజ తన స్టైల్‌లో కౌంటరిచ్చింది… ‘అబ్బో.. మస్త్‌ బీపీ వొస్తాందా సార్‌ మీకు.. సల్ల పడండి జర.. నవ్వుకుంటే అన్ని బాధలు పోతయ్‌ అని నేను నమ్ముతాను.. మరీ అంత పొగరు పనికి రాదు’ అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ఇలా నెగిటివ్ గా కామెంట్ చేసే నెటిజన్లకు తన స్టైల్ లో రిప్లైలు ఇచ్చి వాళ్ళకి షాకిచ్చింది హరితేజ.