New Film Releases: కొత్త సినిమా వచ్చిందా.. తెలంగాణ వైపు సరిహద్దు ఏపీ ప్రేక్షకులు!
సినిమా ఇండస్ట్రీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు దారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత టికెట్ ధరల వివాదం.. బెనిఫిట్ షోల అంశంలో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

New Film Releases: సినిమా ఇండస్ట్రీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు దారులుగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత టికెట్ ధరల వివాదం.. బెనిఫిట్ షోల అంశంలో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. టికెట్ ధరల అంశంపై తెలంగాణలో ఇప్పటికే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారీ సినిమాలకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలు పెంచుకున్నాయి. ఏపీలో ఈ మధ్యనే కోర్టు టికెట్ ధరలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. దానిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం కూడా తెలిసిందే.
2022 Summer Film Releases: సమ్మర్లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!
మొత్తంగా ఇప్పుడు ఏదైనా స్టార్ హీరోలకు సంబంధించి కొత్త సినిమా వస్తే తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు అధికారికంగా ఆస్కారం వచ్చేసింది. దీంతో ఈ వారం విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉదయాన్నే బెనిఫిట్ షోలు ప్రదర్శితం కాగా.. టికెట్ ధరల పెంపుతో భారీ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితం జరుగుతుంది. అదే సమయంలో ఏపీలో రోజులు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉండగా.. టికెట్ ధరల పెంపుకు ఆస్కారం లేకపోవడంతో క్రేజ్ ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేసి మిగతా ప్రాంతాలలో తక్కువ థియేటర్లలో విడుదల చేశారు.
Samantha: సామ్ క్రేజీ ఫార్ములా.. సినిమాలన్నీ డిఫరెంట్ రోల్సే!
దీంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమాలు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా తెలంగాణతో సరిహద్దు ప్రాంతాల ఏపీ ప్రేక్షకులు ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి సినిమా చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అటు, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల ప్రేక్షకులు కూడా కొందరు ఆయా రాష్ట్రాల థియేటర్లకే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. సహజంగానే ఏపీ ప్రజలు ఎక్కువగా ఉండే తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో థియేటర్లలో తెలుగు సినిమాలను కూడా ఎక్కువగానే విడుదల చేస్తారు.
Anasuya: ఓ రేంజ్లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!
దీంతో ఆయా ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఏపీ ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల సమయంలో బెనిఫిట్ షోల కోసం ఎక్కువగా రాష్ట్ర సరిహద్దులు దాటేసి సినిమాలు చూసేందుకు మొగ్గుచూపుతున్నారట. ఒకవిధంగా ఇది థియేటర్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టమే. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని పక్క రాష్ట్రాలకు చెల్లించేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దోపిడీని అరికట్టేందుకు సదుద్దేశ్యంతోనే బెనిఫిట్ షోలను రద్దు చేసినా.. టికెట్ ధరల పెంపుకు నిరాకరించినా ఒకవిధంగా ట్యాక్స్ రూపంలో ఆదాయానికి గడిపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
2Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
3Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
4Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
5presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
6Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
7Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
8The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
9DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
10Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం