చైతూ – సామ్ ఫన్నీ గేమ్‌ చూశారా !

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 09:51 AM IST
చైతూ – సామ్ ఫన్నీ గేమ్‌ చూశారా !

టాలీవుడ్  మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత పెళ్లి తర్వాత మొదటిసారి ‘మజిలీ’ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం నిన్నుకోరి ఫేమ్ శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రంలో దివ్యాంష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేసింది చిత్రమూనిట్.

తాజాగా చై, సామ్‌ ‘గెస్‌ ది వర్డ్‌’ అనే ఓ ఫన్నీ గేమ్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో చై, సామ్ ఎంతో చూడముచ్చటగా ఉన్నరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.