Allu Arjun : బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ అల్లు అర్జున్ పై హేమ మాలిని ప్రశంసలు..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఫిదా అయిన బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని.. అల్లు అర్జున్ ని బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ ప్రశంసలు కురిపించింది.

Allu Arjun : బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ అల్లు అర్జున్ పై హేమ మాలిని ప్రశంసలు..

Hema Malini viral comments on Allu Arjun acting in pushpa

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా వైడ్ భారీ స్టార్‌డమ్ ని సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ అండ్ డైలాగ్స్ కి వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ వచ్చింది. జనరల్ ఆడియెన్ నుంచి స్టార్ సెలబ్రెటీ వరకు ప్రతి ఒక్కరు వాటిని అనుసరించేలా చేసి ఐకాన్ స్టార్ గా నిలిచాడు అల్లు అర్జున్. కాగా బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని తాజాగా అల్లు అర్జున్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమె పుష్ప సినిమా చూసిందట. ఆ సినిమాలో అల్లు అర్జున్ మేకర్ ఓవర్ అండ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది.

Allu Arjun : 30 ఏళ్ళ తర్వాత ఆమెను కలిసిన అల్లు అర్జున్.. కాళ్లకు నమస్కారం చేసి ఆమె నంబర్ 1 అంటూ ఎమోషనల్..

పుష్ప సినిమా చూసిన తరువాత అల్లు అర్జున్ మరో మూవీ కూడా హేమ మాలిని చూసిందట. “పుష్పలో చాలా రస్టిక్ గా కనిపించిన అల్లు అర్జున్, అంతకముందు సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. పుష్ప పాత్రకు తగ్గట్టు తను వేసిన స్టెప్స్ చాలా ఫేమస్ అయ్యాయి. పుష్పలో తన యాక్టింగ్ అండ్ లుక్ నాకు చాలా బాగా నచ్చాయి. మన హిందీ సినిమాలోని హీరోలు అటువంటి పాత్రలు చేయడానికి సందేహిస్తుంటారు” అంటూ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ఇటువంటి కామెంట్స్ చేయడంతో బి-టౌన్ లో వైరల్ అవుతున్నాయి.

Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. అలాంటి రోల్‌లో నటిస్తుందా..?

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ఈ పార్ట్ లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.