NBK 105 ‘రూలర్’ : ‘ధర్మ’గా బాలయ్య రాయల్ లుక్

నటసింహా నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నసినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 09:44 AM IST
NBK 105 ‘రూలర్’ : ‘ధర్మ’గా బాలయ్య రాయల్ లుక్

నటసింహా నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నసినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..

నటసింహా నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 105’ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు.. ముందు నుండి ప్రచారంలో ఉన్నట్లుగానే ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలయ్య పోషిస్తున్న పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’ లుక్ రిలీజ్ చేశారు. బాలయ్య ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. పొగరెక్కిన పవర్ ఫుల్ పోలీస్‌గా చేతిలో మలాటుతో ఉన్న లుక్‌‌కి రెస్పాన్స్ బాగుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’గా బాలయ్య రికార్డులపై దాడి చేయనున్నాడు.. 

Read Also : ‘రూలర్’ మోషన్ పోస్టర్ : ‘సీటీ మారో, సెల్ఫీ లే యారో’

వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌ కాగా భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కథ : పరుచూరి మురళి, మాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..