మ్యాచోస్టార్‌ గోపిచంద్ 28 ‘‘సీటీమార్’’ – ఫస్ట్‌లుక్

మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న‘‘సీటీమార్’’ - ఫస్ట్‌లుక్..

  • Published By: sekhar ,Published On : January 27, 2020 / 04:29 AM IST
మ్యాచోస్టార్‌ గోపిచంద్ 28 ‘‘సీటీమార్’’ – ఫస్ట్‌లుక్

మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న‘‘సీటీమార్’’ – ఫస్ట్‌లుక్..

మ్యాచో స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా గోపిచంద్ 28వ సినిమా ఇది. మ్యాచో స్టార్‌తో మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుండగా.. దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటిస్తోంది. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Image

సోమవారం ఉదయం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ‘‘సీటీమార్’’ అనే పేరునే ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నెత్తిన టోపీ పెట్టుకుని, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా  గోపిచంద్‌ కనిపిస్తున్నాడు. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపిచంద్, తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా కనిపించనున్నారని తెలుస్తోంది.

Read Also : మే 8న రవితేజ ‘‘క్రాక్’’

Image

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ : “ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈరోజు నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమా హీరో గోపిచంద్‌కి భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అవుతుంది’’ అన్నారు.
తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి : సౌందర్‌ రాజన్‌, సంగీతం : మణిశర్మ, ఎడిటర్ : తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ : డి.వై.సత్యనారాయణ, సమర్పణ : పవన్‌ కుమార్‌, నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం : సంపత్‌ నంది.