పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే – ఫస్ట్ లుక్ వచ్చేస్తోందోచ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా ఫస్ట్ లుక్ అప్‌డేట్..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 08:25 AM IST
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే – ఫస్ట్ లుక్ వచ్చేస్తోందోచ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా ఫస్ట్ లుక్ అప్‌డేట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘పింక్’ రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫిబ్రవరి 27న విడుదల చేయాలనుకుని వాయిదా వేశారు. తాజాగా PSPK 26 కి సంబంధించిన అప్‌డేట్ అవచ్చింది. మార్చి2వ తేది సోమవారం సాయంత్రం 5 గంటలకు పవన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఆదివారం ప్రీ లుక్ విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా ప్రకటించనున్నారని సమాచారం. వేసవి కానుకగా మే 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాటలు : తిరు, సగీతం : థమన్, కెమెరా : పి ఎస్ వినోద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ : రాజీవన్.
Here’s the Pre Look of Power Star  Pawan Kalyan’s PSPK 26