Liger: నువ్వు పుట్టిందే గెలిచేటందుకు.. లైగర్ హంట్ బిగిన్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.

Liger: నువ్వు పుట్టిందే గెలిచేటందుకు.. లైగర్ హంట్ బిగిన్స్!

Liger

Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. ఇక ఈరోజు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో సినిమా నుంచి ‘లైగర్ హంట్’ అనే సాంగ్ థీమ్ ను రిలీజ్ చేశారు.

Liger: లైగర్ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సాలిడ్ ఢీల్..?

ఈ హంట్ థీమ్ లో విజయదేవర కొండ వేటాడే సింహాలా కనిపించారు. విజయ్ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఒక యూనివర్సల్ స్టార్ లా కనిపించారు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్ గా వుంది. సిక్స్ ప్యాక్ దేహంతో బాక్సింగ్ రింగ్ లో శత్రువుని మట్టికరిపించే యోధుడిలా కనిపించారు.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

“బతకాలంటే గెలవాల్సిందే.. లెగు.. లెగు. ఎగరాలంటే రాగలాల్సిందే.. లెగు.. లెగు “అంటూ సాగిన లిర్టిక్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. భాస్కర్ బట్ల రాసిన మోటివేషనల్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. విక్రమ్ మాంట్రోస్ ఈ థీమ్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. హేమచంద్ర తనదైన శైలిలో ఆలపించాడు. రౌడీ హీరో యాటిట్యూడ్, పూరి మాస్ ఎలివేషన్స్ తో ఈ సాంగ్ మంచి హైప్ ను తెచ్చుకొంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షుకుల ముందుకు రానుంది.