Aditya Om : రోజుకు 60 సిగరెట్లు తాగేవాడ్ని.. ఇంకా బతికే ఉన్నారా అని అడిగేవారు.. హీరో ఆదిత్య ఓం కంబ్యాక్..

ఆదిత్య ఓం మెయిన్ లీడ్ లో నటించిన దహనం సినిమా మార్చ్ 31న రిలీజయింది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాని ఇన్నాళ్లు అంతర్జాతీయ అవార్డులకు పంపించి పలు అవార్డులని కూడా గెలుచుకున్నారు. తాజాగా ఈ సినిమాని రిలీజ్ చేయగా సినిమా ప్రమోషన్స్ లో...................

Aditya Om :  ఒకప్పటి హీరో ఆదిత్య ఓం లాహిరి లాహిరి లాహిరిలో లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మెప్పించాడు. దాదాపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలానే సినిమాలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన ఆదిత్య ఓం కొన్ని హిందీ సినిమాల్లో నటించడం, దర్శకత్వంకూడా చేశాడు. అయితే కొన్నాళ్లుగా పరిశ్రమకి దూరంగా ఉన్న ఆదిత్య ఓం తాజాగా దహనం అనే ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు.

ఆదిత్య ఓం మెయిన్ లీడ్ లో నటించిన దహనం సినిమా మార్చ్ 31న రిలీజయింది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాని ఇన్నాళ్లు అంతర్జాతీయ అవార్డులకు పంపించి పలు అవార్డులని కూడా గెలుచుకున్నారు. తాజాగా ఈ సినిమాని రిలీజ్ చేయగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆదిత్య ఓం మాట్లాడుతూ తన లైఫ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Dasara Collections: యూఎస్ బాక్సాఫీస్ వద్ద ధరణిగాడి ఊచకోత..!

ఆదిత్య ఓం మాట్లాడుతూ.. సినిమాలు లేని టైం లో ఒకానొకసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. రోజుకి 60 సిగరెట్లు తాగాను ఆ టైం లో. అందరు లైఫ్ లో నెగిటివ్ ఫేస్ చూస్తారు, నేను కూడా చూశాను. నా ఫ్యామిలీ వల్ల ఆ డిప్రెషన్ నుంచి బయటకి రాగలిగాను. 2017 నుంచి మందు, సిగరెట్స్ మానేసాను. ఆ తర్వాత మల్లి వాటి జోలికి వెళ్ళలేదు. ఆ పొజిషన్ నుంచి బయటకి వచ్చాక చాలా మంది నన్ను బతికి ఉన్నావా ఇంకా అని అడిగేవారు. కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ చూశాను. సినీ పరిశ్రమలో విమర్శలకు బాధపడకూడదు,పొగడ్తలకు పొంగిపోకూడదు అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు