Rajinikanth : రజినీకాంత్ తో కార్తీ, నాజర్ భేటీ.. ఇందుకోసమేనా??

తాజాగా రజినీకాంత్ ని తమిళ హీరో కార్తీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ కలిశారు. ఈ భేటీ ప్రస్తుతం తమిళ సినిమా రంగంలో చర్చలకు దారి తీసింది..............

Rajinikanth : రజినీకాంత్ తో కార్తీ, నాజర్ భేటీ.. ఇందుకోసమేనా??

Rajinikanth

Rajinikanth :  సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సినిమా కథలు వింటూ నెక్స్ట్ సినిమా గురించి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చి ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా రజినీకాంత్ ని తమిళ హీరో కార్తీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ కలిశారు. ఈ భేటీ ప్రస్తుతం తమిళ సినిమా రంగంలో చర్చలకు దారి తీసింది.

అయితే వీరిద్దరూ రజినీకాంత్ ని నడిగర్‌ సంఘం తరపున కలిసినట్టు సమాచారం. అనేక వివాదాల అనంతరం రెండేళ్ల తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు రాగా నాజర్ అధ్యక్షుడిగా, కార్తీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న నడిగర్ సంఘ నూతన భవన నిర్మాణానికి పనులు మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

Nazriya Nazim : అంటే సుందరం కోసం అద్భుతంగా తయారైన నజ్రియా..

ఇందులో భాగంగానే వీరిద్దరూ రజినీకాంత్ ని కలిశారు. నూతన భవనం నిర్మాణం గురించి రజనీకాంత్‌ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్‌ తెలిపారు. త్వరలోనే ఈ భవన నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలిపారు.