Karthi : అన్నయ్య నిర్మాణంలో 96 దర్శకుడితో కార్తీ సినిమా..

తమిళ హీరో కార్తీ గత ఏడాది వరుస విజయాల్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా కార్తీ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది. '96'ని తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ తో కార్తీ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా..

Karthi : అన్నయ్య నిర్మాణంలో 96 దర్శకుడితో కార్తీ సినిమా..

hero karthi collaborate with 96 director for his next project

Karthi : తమిళ హీరో కార్తీ గత ఏడాది వరుస విజయాల్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. క్రిందటి సంవత్సరం వీరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్టుని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘జపాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మాఫియా కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ కమెడియన్ సునీల్ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Karthi : ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న హీరో కార్తీ..

తాజాగా కార్తీ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది. 2019 లో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ’96’ని తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ తో కార్తీ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో జరుగనుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీ జపాన్ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. జపాన్ మూవీ షూటింగ్ పూర్తీ అవ్వగానే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఇక ఈ సినిమాని కార్తీ అన్న సూర్య నిర్మించబోతున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని హీరో సూర్య ప్రతిస్టాత్మకంగా నిర్మించనున్నాడు.

కాగా కార్తీ నటిస్తున్న మరో సినిమా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. భారీ మల్టిస్టార్రర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి కూడా హీరోలుగా నటిస్తుండగా.. త్రిష, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. మణిరత్నం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 28‌న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.