Hero : సంక్రాంతికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ‘హీరో’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు......

Hero : సంక్రాంతికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

Hero

Hero :   ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కాని ఈ సంక్రాంతికి కరోనా వల్ల, ఏపీలో థియేటర్స్, టికెట్ రేట్ల ప్రాబ్లమ్ వల్ల ఏ సినిమాలు వస్తాయో ఏ సినిమాలు రావో క్లారిటీ లేకుండా పోయింది. మొన్నటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తుంది అనుకున్నారు. కాని ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. భీమ్లా నాయక్ ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. రాధేశ్యామ్ కూడా డౌట్ గానే ఉంది. దీంతో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండవేమో అనిపిస్తుంది.

ఇలాంటి టైంలో పండగకి ఫ్యామిలీ అంతా కచ్చితంగా సినిమాలకి వస్తారు కాబట్టి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో ఈ టైంని క్యాష్ చేసుకోవాలని ఒక్కసారిగా చిన్న సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగానే నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు సిద్ధూ హీరోగా వస్తున్న ‘డీజే టిల్లు’ సినిమా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. వీటితో పాటు మరో సినిమా కూడా సంక్రాంతికి రానుంది.

Unstoppable with NBK : భళ్లాలదేవతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ‘హీరో’ అని పెట్టారు. ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. మహేష్ బాబు సోదరి పద్మావతి గల్లా ఈ సినిమాని అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

Krithi Shetty : మళ్ళీ రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బేబమ్మ

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హీరో’ సినిమాని జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని సంక్రాంతికి అనౌన్స్ చేసిన స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడటంతో ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమాని జనవరి 15న విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతికి మహేష్ నుంచి సినిమా లేకపోవడంతో సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.