Hero Movie: హీరో కథ గల్లా అశోక్ కాదా.. నితిన్ కోసం రాసుకున్నారా?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ ‘హీరో’. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Hero Movie: హీరో కథ గల్లా అశోక్ కాదా.. నితిన్ కోసం రాసుకున్నారా?

Hero Movie

Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ ‘హీరో’. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ లాంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేపట్టగా మహేష్ అభిమానుల నుండి భారీ స్పందన వస్తుంది.

Chiranjeevi Anushka: మరోసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న జేజెమ్మ!

కాగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ తో ఈ సినిమా కథ ఇదేనా అంటూ చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా కథ ముందుగా నితిన్ కోసం రాసుకున్నారని.. కొన్ని అనివార్య కారణాలతో నితిన్ స్థానంలో గల్లా అశోక్ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కిందనే ఓ ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతుంది. నితిన్ తో ఈ సినిమా తీయాలన్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అతనికి కథ కూడా వినిపించాడట. నితిన్ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా మొదలు పెట్టాలని అనుకున్నారు.

Ashu Reddy: హాట్‌నెస్ మీ కళ్ళలో ఉంది.. నా థైస్‌లో కాదు!

కానీ, ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ గల్లా కాంపౌండ్ కి చేరి అశోక్ హీరోగా మహేష్ బాబు సోదరి నిర్మాణంలో సొంత బ్యానర్ లో ఈ సినిమా మొదలైంది. అయితే.. గతంలో నితిన్ హీరో అనే టైటిల్ తోనే తెరకెక్కిన సినిమా అప్పుడు తనకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నాడా.. లేక దర్శకుడే అశోక్ తో ముందుకెళ్లాడా అన్నది తెలియదు. ఈ హీరో సినిమా గతంలో నితిన్ హీరో మాదిరి కాకుండా అశోక్ కు బెస్ట్ డెబ్యూ అవుతుందో లేదో చూడాలి.