Nani on Theatres : థియేటర్స్‌పై హీరో నాని షాకింగ్ కామెంట్స్

థియేటర్స్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు.

10TV Telugu News

Nani on Theatres : థియేటర్స్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు. తిమ్మరుసు సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాని ఈ కామెంట్స్ చేశారు.

సినిమా అనేది మన కల్చర్, థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం అనేది మన బ్లడ్ లోనే వుందన్నారు. రెస్టారెంట్స్, పబ్స్ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్ చాలా సేఫ్ అని చెప్పారు. కానీ వాటినే ముందు మూస్తారు లాస్ట్ లో తెరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం మన ఇంటి తరువాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే అని నాని అన్నారు.

నేను ఒక ప్రేక్షకుడి గా చెపుతున్నా, మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ లేదన్నారు. థియేటర్ వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారని, వాళ్లంతా సఫర్ అవుతున్నారని నాని వాపోయారు. పరిస్థితులు ఇలానే వుంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుందని హెచ్చరించారు. వందల మంది మధ్య కూర్చొని థియేటర్ లో సినిమా చూడటం అనేది నెక్స్ట్ జనరేషన్ కి కష్టమే అని నాని అభిప్రాయపడ్డారు. అందరూ కలసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని నాని చెప్పారు.

10TV Telugu News