Prabhas : ప్రభాస్‌కు టీజర్ లెవెల్‌లో బర్త్ డే విష్ చేసిన నాని

డార్లింగ్ ప్రభాస్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గా విష్ చేశాడు. ఎప్పటిలాగే వెలిగిపో... ప్రేమను పంచుతూ ఉండు అని

Prabhas : ప్రభాస్‌కు టీజర్ లెవెల్‌లో బర్త్ డే విష్ చేసిన నాని

Prabhas

Prabhas : డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తెలుగు ప్రముఖులు, అభిమానులే కాదు… ప్యాన్ ఇండియా స్థాయిలో శుభాకాంక్షల వెల్లువ కనిపిస్తోంది. అందిరివాడు… మంచోడు.. వివాదాలకు దూరంగా ఉంటాడు అన్న ట్యాగ్స్ తెచ్చుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్…. తన బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్( Radhe Shyam) టీజర్ తో అందరికీ భారీ గిఫ్ట్ ఇచ్చేశాడు. విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ ను చూసినవాళ్లే చూసి..   మళ్లీ మళ్లీ చూసి.. డీకోడ్ చేసేందుకు… బ్రేక్ త్రూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటే… గుండెల నిండా ప్రేమతో ప్రభాస్ కు విష్ చేస్తున్నారు.

Read This : Radhe Shyam Teaser: రాధేశ్యామ్ టీజర్.. అంతర్లీనంగా కథను చెప్పిన మేకర్స్!

హీరో నాని… ప్రభాస్ కు Radhe Shyam టీజర్ లెవెల్ లో విష్ చేశాడు. ఈ విష్ చాలామందిని ఆకట్టుకుంటోంది. నాకు తెలుసు.. కానీ నేను చెప్పను అని టీజర్ లో సందర్భానుసారం చెబుతుంటాడు హీరో. ఇదే స్టైల్లో… “అన్నా… నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పను” అని నాని ట్వీట్ చేశాడు.

నాని విష్ చేసిన విధానానికి.. ఫ్యాన్స్ అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. స్మైలీలిస్తూ.. పంచ్ డైలాగ్ బాగా వాడావ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. ప్రభాస్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ప్రభాస్ కనిపిస్తున్నాడంటూ.. ఓ ఆటోకు వెనక ఉన్న పోస్టర్  ప్రింట్ ను ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. ఇది #GlobalPrabhasDay గా మారిందని చెప్పాడు. చాలా కొద్దిమంది నటులు మాత్రమే ఇలాంటి భారీ ప్రేమను దక్కించుకుంటారని చెప్పాడు. మనం కలిసి చేయబోయే సాహసం మొదలుపెట్టడం గురించి ఇంకా ఎంతోకాలం వేచి ఉండలేకపోతున్నా అని నాగ్ అశ్విన్ అన్నాడు.

డార్లింగ్ ప్రభాస్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గా విష్ చేశాడు. ఎప్పటిలాగే వెలిగిపో… ప్రేమను పంచుతూ ఉండు అని ఆకాంక్షించాడు.