Karthikeya 3 : కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

యంగ్ హీరో నిఖిల్ ఈ సవత్సరం రెండు సక్సెస్‌లు అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా రెండో సినిమాలతో విజయాన్ని అందించిన అభిమానులకి కృతాజ్ఞతలు తెలిపేందుకు, నిన్న ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. ఈ క్రమంలోనే కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చాడు.

Karthikeya 3 : కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

Hero Nikhil gave update about Karthikeya 3

Karthikeya 3 : యంగ్ హీరో నిఖిల్ ఈ సవత్సరం రెండు సక్సెస్‌లు అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మధ్యలో ‘కార్తికేయ-2′ వంటి యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి పాన్ ఇండియా హిట్టుని అందుకున్నాడు. తాజాగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ’18 పేజిస్’ థియేటర్లో సందడి చేస్తుంది. సుకుమార్ కథని అందించిన ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లో నిఖిల్‌కి జంటగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

Nikhil Siddhartha : నా లైఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని నేను ఎప్పటికి మర్చిపోలేను.. నిఖిల్!

వరుసగా రెండో సినిమాలతో విజయాన్ని అందుకొని సక్సెస్‌ఫుల్ జోడి అనిపించుకున్నారు. కాగా ’18 పేజిస్’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందించిన అభిమానులకి కృతాజ్ఞతలు తెలిపేందుకు, నిన్న ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్.. “అన్న కార్తికేయ-3 ఉండబోతుందా” అంటూ అడగా, నిఖిల్ ఉంటుంది అంటూ కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చాడు.

“కార్తికేయ-3 కచ్చితంగా ఉంటుంది. అయితే ఈసారి థ్రిల్‌ని 3dలో ఎక్స్‌పిరెన్స్ చేయబోతున్నారు. డైరెక్టర్ చందు ముండేటి ఇటీవలే ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాడు” అంటూ తెలియజేశాడు నిఖిల్. దీంతో త్వరలోనే కార్తికేయ-3 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సూపర్ హిట్ కావడం, ఇప్పుడు వచ్చిన సీక్వెల్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు.