Nikhil: కార్తికేయ-2 హీరో నిఖిల్‌ని కలవనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. అందుకోసమేనా?

ఒక చిన్న డైరెక్టర్ తో, ఒక చిన్న హీరోతో, ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎన్నో అద్భుతాలను సృష్టించిన సినిమా కార్తికేయ-2. ప్రత్యేకంగా ఈ సినిమాకి హిందీ బెల్ట్ లో బ్రహ్మరథం పట్టారు. ఇక హీరో నిఖిల్ ని అయితే...

Nikhil: కార్తికేయ-2 హీరో నిఖిల్‌ని కలవనున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. అందుకోసమేనా?

Hero Nikhil Readt To Meet Amit Shah

Nikhil: కార్తికేయ-2.. ఒక చిన్న డైరెక్టర్ తో, ఒక చిన్న హీరోతో, ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎన్నో అద్భుతాలను సృష్టించిన సినిమా. కార్తికేయ-1 ఇచ్చిన చిన్న గెలుపుతో కేవలం దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందిస్తుందని మూవీ టీం కూడా భావించలేదని చాలా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు చిత్ర యూనిట్.

Karthikeya2: తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా కార్తికేయ-2.. అసలు విషయమేంటంటే?

చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ప్రత్యేకంగా ఈ సినిమాకి హిందీ బెల్ట్ లో బ్రహ్మరథం పట్టారు. అసలు బాలీవుడ్ లో ప్రేక్షకులు థియేటర్లకు రాని సమయంలో ఈ చిత్రం హౌస్ ఫుల్స్ తో నడిచిందంటేనే అర్ధమవుతుంది ఇది ఎంతటి విజయమో అని. ఇక హీరో నిఖిల్ ని అయితే ఈ సినిమా ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

ఈ స్టార్ ఇమేజ్ నే జాతీయ పార్టీ అయిన ”బిజెపి” క్యాష్ చేసుకుందామని భావిస్తోందట. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా, హీరో నిఖిల్ ను కలవనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన హైదరాబాద్ పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రానుండగా, ఆ రోజునే హీరో నిఖిల్ ని కూడా కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా ఈ మధ్యకాలం బిజెపి నాయకులు వరసపెట్టి టాలీవుడ్ హీరోలను కలుస్తున్న సంగతి తెలిసిందే.