సెగ మొదలైంది.. వర్మను దేనితో పోల్చాడో తెలుసా!

  • Published By: sekhar ,Published On : July 22, 2020 / 12:27 PM IST
సెగ మొదలైంది.. వర్మను దేనితో పోల్చాడో తెలుసా!

రామ్‌గోపాల్ వ‌ర్మ‌… ఒక‌ప్పుడు సెన్సేష‌న్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారాడు. ఆయ‌న తీసే సినిమాలు ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల‌కు కార‌ణాల‌వుతున్నాయి. తాజాగా ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పవర్‌స్టార్‌’. ఈ సినిమాలో పాత్ర‌ధారులు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, చిరంజీవిల‌ను పోలి ఉండ‌టం, ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవన్ ఓటమినే టార్గెట్ చేయడంతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అభిమానులు ఆర్జీవీపై కోపంగా ఉన్నారు. కొందరు వర్మపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తుంటే… మ‌రికొంద‌రు డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. Power Starఇప్పుడు యంగ్ హీరో ప‌వ‌న్ అభిమాని అయిన నిఖిల్ ఒక్క‌సారిగా వ‌ర్మ‌పై ఫైర్ అయ్యాడు. ‘‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’’.. అంటూ నిఖిల్ ఆర్జీవీని తిడుతూ ట్వీట్ చేయడం విశేషం. నిఖిల్ బాటలో ఇంకెవరైనా సినీ పరిశ్రమకు చెందిన వారు వర్మపై విమర్శలు ఎక్కుపెడతారేమో చూడాలి మరి.