నితిన్ నిశ్చితార్థం అయిపోయింది!

  • Published By: sekhar ,Published On : July 22, 2020 / 03:48 PM IST
నితిన్ నిశ్చితార్థం అయిపోయింది!

టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుకలు నేటి నుంచే మొద‌ల‌య్యాయి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. ప‌రిమిత అతిథుల మ‌ధ్య ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Nithin got Engaged

ఎంగేజ్‌మెంట్‌తో ప్రారంభ‌మైన ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు ఆసాంతం కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రిస్తూనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు నితిన్. త‌న‌ పెళ్లికి వ‌చ్చి ఆశీర్వ‌దించాల్సిందిగా కోరుతూ నితిన్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స్వ‌యంగా ఆహ్వానం అంద‌జేశారు. అలాగే సినీ ఇండ‌స్ట్రీలో తన అభిమాన హీరోగా చెప్పుకునే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను పెళ్లికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు.

Nithin got Engaged