CM KCR-Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన హీరో శర్వానంద్.. ముచ్చటేంటంటే..?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(CM KCR)ను హీరో శర్వానంద్(Sharwanand) కలిశారు.

CM KCR-Sharwanand
Sharwanand: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(CM KCR)ను హీరో శర్వానంద్(Sharwanand) కలిశారు. ప్రగతి భవన్‌లో గురువారం సీఎంను కలిసిన శర్వా తన రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్యాయంగా శర్వానంద్‌ను పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని కన్వెన్షన్ ఫెసిలిటీలో శుక్రవారం శర్వానంద్ రిసెప్షన్ జరగనుంది.
ఇటీవల జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షిత పెళ్లి జరిగింది. ఈ వివాహవేడుకకు అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారు. రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి, నిర్మాత వంశీ, అనురాగ్ వంటి ప్రముఖులు విచ్చేశారు. రక్షితారెడ్డి ఎవరో కాదు మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు.
Megha Akash: పీకల్లోతు ప్రేమలో మేఘా ఆకాశ్.. త్వరలోనే పెళ్లి..? వరుడు అతడేనంట..?
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘భలేమంచిరోజు’, ‘శమంతకమణి’, ‘హీరో’ లాంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. శర్వానంద్ 35 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ శర్వానంద్ పుట్టిన రోజున విడుదల చస్త్రశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శర్వా పెళ్లి కారణంగా షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ను ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.
Sara Ali Khan: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన సారా అలీఖాన్