Siddharth : సినిమా హాళ్ళని బతకనివ్వండి… హీరో సిద్దార్థ్ ట్వీట్..

తాజాగా టాలీవుడ్ పై చూపిస్తున్న ఏపీ ప్రభుత్వ విధానాలను హీరో సిద్దార్థ్ వ్యతిరేకిస్తూ వరుస ట్వీట్లు చేశారు. గౌరవనీయమైన రాష్ట్ర ప్రభుత్వాలకు దయచేసి సినిమాను, సినిమా హాళ్లు బతికే....

Siddharth : సినిమా హాళ్ళని బతకనివ్వండి… హీరో సిద్దార్థ్ ట్వీట్..

Siddarth

Siddharth :  గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమ, థియేటర్స్ పై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవ్వరికి రుచించట్లేదు. టికెట్స్ రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు రద్దు చేయడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెటింగ్.. ఇలాంటి వాటిపై ఇప్పటికే చిరంజీవి, రాఘవేంద్ర రావు, సురేష్ బాబు లాంటి ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కొంతమంది సినీ ప్రముఖులు దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ టికెట్ రేట్ల అంశంలో కొంతమంది సినీ పెద్దలు, ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని ఇప్పుడు బిజీగా ఉన్నారు తర్వాత చూద్దాం అంటూ తెలిపారు.

Upasana : సోదరి పెళ్లి వేడుకల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన

తాజాగా టాలీవుడ్ పై చూపిస్తున్న ఏపీ ప్రభుత్వ విధానాలను హీరో సిద్దార్థ్ వ్యతిరేకిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ” ఒక ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీకి ఎంత వసూలు చేయాలో మీరు రెస్టారెంట్‌కి చెప్పరు. తమ పెట్టుబడిని ఎలా రికవరీ చేసుకోవాలో చెప్పాలనే ప్రభుత్వ ఉద్దేశ్యంతో సినిమా పరిశ్రమను నిరంతరం సమస్యల్లో పడేస్తున్నారు. టిక్కెట్ రేట్లు మరియు షోలపై పరిమితుల కోసం ఇచ్చిన GOలు MRTP (Monopolistic and Restrictive Trade Practice)యాక్ట్ ని ఉల్లంఘించినట్టే” అని అన్నారు.

Samantha : సోషల్ మీడియాలో మరో రికార్డ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సమంత..

”గౌరవనీయమైన రాష్ట్ర ప్రభుత్వాలకు దయచేసి సినిమాను, సినిమా హాళ్లు బతికే అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. 25 ఏళ్ల క్రితం తొలిసారిగా విదేశాల్లో సినిమా చూశాను. అప్పుడు 8 డాలర్లు అంటే అప్పట్లో 200 రూపాయలు. కాని ఇప్పుడు మీరు అంతకన్నా తక్కువ పెట్టారు. మీరు సినిమా కంటే మద్యానికి, పొగాకుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. మా సినిమా వ్యాపారం ద్వారా లక్షలాది మంది ప్రజలు చట్టబద్ధంగా జీవనోపాధి పొందుతున్నారు. మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పకండి. మాకు పన్ను విధించండి, సెన్సార్ చేయండి అంతే కాని నిర్మాతలు మరియు సినిమాలపై ఆధారపడి బతికే వాళ్ళ జీవనోపాధిని తీసేయకండి” అని ట్వీట్ చేశారు.

Bigg Boss 5 : మళ్ళీ హగ్గులంటూ మొదలుపెట్టిన సిరి.. ఇవ్వాలా వద్దా అని షణ్ముఖ్‌

”ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు సినిమాలు చూడండి అని. చాలా మంది ఉచితంగా వినోదం కావాలి అంటూ పైరసీని ప్రోత్సహించారు. దాని వల్ల ఎన్ని కోట్ల నష్టం జరిగిందో మీకు తెలీదు. బాగా డబ్బులు సంపాదిస్తున్న రాజకీయ నాయకులను లేదా వ్యాపారవేత్తలను మీరు ప్రశ్నించలేరు? సినిమా పరిశ్రమపై మాత్రం పెత్తనం చూపిస్తారు. ఒక సినిమా బడ్జెట్ చూసే వాళ్ళు డిసైడ్ చేయరు. సినిమాని సృష్టించే వాళ్లే డిసైడ్ చేస్తారు. మేము మీ అంత గొప్ప వాళ్ళం కాకపోవచ్చు కానీ మేము కూడా మనుషులమే. మేము అందరి కంటే ఎక్కువ పన్ను కూడా చెల్లిస్తున్నాము. వినోదం మరియు కళను అందరికి పంచే మా జీవనోపాధిని చంపడం మానేయండి” అంటూ ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమపై తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ట్వీట్స్ చేశారు.

Anand Devarakonda : సైకోగా ఆనంద్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్లతో కలిసి కొత్త ప్రయోగం

సిద్దార్థ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి సిద్దార్థ్ చేసిన ఈ సీరియస్ ట్వీట్స్ పై ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా? లేక చూసి చూడనట్టు వదిలేస్తుందా? చూడాలి.