Sudarshan : సినిమాల్లేవా.. అందుకే వెబ్ సిరీస్ చేస్తున్నావా అని అడగడంతో.. సీరియస్ అయిన హీరో సుశాంత్

ఈ సిరీస్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో హీరో సుశాంత్, కమెడియన్ సుదర్శన్ స్టేజిపై సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ వెబ్ సిరీస్ ని తక్కువ చేసి మాట్లాడటంతో హీరో సుశాంత్ అసహనానికి ఫీల్ అయ్యాడు........

Sudarshan : సినిమాల్లేవా.. అందుకే వెబ్ సిరీస్ చేస్తున్నావా అని అడగడంతో.. సీరియస్ అయిన హీరో సుశాంత్

Sushanth

Maa Neella Tank : అడ్డా, కరెంట్, చి.ల.సౌ… లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరో సుశాంత్ ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మొదలుపెట్టాడు. అలవైకుంఠపురంలో సినిమాలో మెప్పించిన సుశాంత్ త్వరలో రవితేజ రావణాసుర సినిమాలో కూడా ముఖ్య పాత్రలో చేయనున్నాడు సుశాంత్. ఇప్పుడు స్టార్స్ కూడా ఓటీటీలలోకి ఎంట్రీ ఇస్తుండటంతో సుశాంత్ కూడా ఓ మంచి వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మా నీళ్ల ట్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో వచ్చాడు సుశాంత్. ఇందులో లీడర్ ఫేమ్ ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో జులై 15 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

Vivek Agnihotri : వాళ్ళు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది..

అయితే ఇటీవల ఈ సిరీస్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో హీరో సుశాంత్, కమెడియన్ సుదర్శన్ స్టేజిపై సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ వెబ్ సిరీస్ ని తక్కువ చేసి మాట్లాడటంతో హీరో సుశాంత్ అసహనానికి ఫీల్ అయ్యాడు. మొదట కామెడీగా కాసేపు వీళ్లిద్దరి మధ్య మాటలు నడిచినా చివర్లో సుదర్శన్.. వెబ్ సిరీస్ చేస్తున్నావు, మనలో మన మాట సినిమాల్లేవా? అని హీరో సుశాంత్ ని అడగడంతో సుశాంత్ సీరియస్ అయ్యాడు. సుశాంత్ దీనికి సమాధానమిస్తూ.. ”సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్‌? కంటెంట్‌ ఉందో లేదో సిరీస్‌ చూస్తేనే తెలుస్తుంది. మంచి కంటెంట్ కాబట్టి చేశాం. చాలా మంది స్టార్స్ ఉన్నారు ఇందులో” అని సీరియస్ గా మాట్లాడాడు. అయితే ఇదంతా ప్రమోషన్ లో భాగంగానే సరదాగా చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోని సుశాంత్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.