Ee Nagaraniki Emaindi : ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలా.. రిలీజ్ అయిన అయిదేళ్లకే..

ఇటీవల ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఎవరు మొదలుపెట్టారో కానీ ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలని వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ లకి కూడా మంచి రెస్పాండ్, కలెక్షన్స్ బాగా వస్తుండటంతో టాలీవుడ్................

Ee Nagaraniki Emaindi : ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలా.. రిలీజ్ అయిన అయిదేళ్లకే..

Hero Vishwaksen ready to re release Ee Nagaraniki Emaindi movie

Ee Nagaraniki Emaindi :  ఇటీవల ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఎవరు మొదలుపెట్టారో కానీ ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలని వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ లకి కూడా మంచి రెస్పాండ్, కలెక్షన్స్ బాగా వస్తుండటంతో టాలీవుడ్ వర్గాలు పాత సూపర్ హిట్ సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ధనుష్, ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి, వెంకటేష్.. లాంటి పలువురు హీరోలు కూడా తమ పాత సినిమాలని రీ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎప్పుడో ఓ పదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ళ క్రితం సినిమాలు రీ రిలీజ్ చేశారు, స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేశారు అంటే అనుకోవచ్చు. కానీ ఈ రీ రిలీజ్ లకి వస్తున్న క్రేజ్ చూసి ఓ యువ హీరో కూడా తన రెండో సినిమాని రీ రిలీజ్ చేస్తానంటున్నాడు. అది కూడా జస్ట్ అయిదేళ్ల క్రితం సినిమాని రీ రిలీజ్ చేస్తా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Veerasimha Reddy : బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. ఒక్కరోజే 54 కోట్ల ఊచకోత కోసిన వీరసింహారెడ్డి..

వెళ్ళిపోమాకే అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ మొదటి సినిమాతో ఎవరు పట్టించుకోకపోయినా రెండో సినిమాగా ఈ నగరానికి ఏమైంది వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరో అని కాకుండా నలుగురిలో ఒకడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుసగా హిట్స్ కొట్టి హీరోగా సెటిల్ అయ్యాడు విశ్వక్. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రీ రిలీజ్ ల హంగామా కొనసాగుతుండటంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ నగరానికి ఏమైంది సినిమా రీ రిలీజ్ కావాలని అడిగారు. దీంతో ఈ హీరో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా రీ రిలీజ్ కావాలా? ఓకే. త్వరలోనే చేసేద్దాం అని అధికారికంగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దీంతో కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది ఏమో ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలా, రిలీజయి ఐదేళ్లే గా అయింది, స్టార్ హీరో సినిమా కూడా కాదుగా, రీ రిలీజ్ కి డబ్బులు వస్తుండటంతో ఇది కూడా ప్లాన్ చేశారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా మొత్తానికి ఇంకో సినిమా రీ రిలీజ్ కి రెడీ అయిందన్నమాట.