South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సౌత్‌ సినిమాలు విడుదవుతుందంటే థియేటర్ల ముందు జనం క్యూ కడుతున్నారు. దీంతో స్టార్‌ హీరోలు రెమ్యునరేషన్లు పెంచేశారు. సౌత్‌ హీరోలు ఒక్కొ సినిమాకు ఎంతంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

South Star Heroes

South Star Heroes: సౌత్‌ హీరోల రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ప్రపంచ వ్యాప్తంగా సౌత్‌ సినిమాలు మంచి ఆదరణ లభిస్తుంది. బాహుబలి నుంచి KGF2 వరకు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించి..కోట్లు కొల్లగోట్టింది. ఇటీవల రిలీజ్‌ అయిన RRR‌, KGF2 సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లపైనే వసూలు చేసింది. మరోవైపు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్‌ లేకుండా రిలీజ్‌ అయిన పుష్ఫ మూవీ.. బాలీపుడ్‌ ఇండస్ట్రీ షేక్‌ చేసింది. దీంతో సౌత్‌ సినిమాలు విడుదవుతుందంటే థియేటర్ల ముందు జనం క్యూ కడుతున్నారు. దీంతో స్టార్‌ హీరోలు రెమ్యునరేషన్లు పెంచేశారు. సౌత్‌ హీరోలు ఒక్కొ సినిమాకు ఎంతంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

South Star Hero’s: సై అంటే సై.. తగ్గేదేలే అంటోన్న కన్నడ, తమిళ్ స్టార్స్

కోలీవుడ్ హీరో విజయ్‌ తన ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్‌ అయిన బీస్ట్‌ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే టాలీపుడ్ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోయే సినిమాకు కోసం రూ.118 కోట్లు తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. మరోవైపు వలీమై చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరో అజిత్‌..తన తదుపరి చిత్రం కోసం రూ.105 కోట్లు వరకు తీసుకుంటున్నారని సమాచారం.. అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న తొలి బారతీయ నటుల్లో సూపర్‌ స్టార్‌ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఓ సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నారు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ రెమ్యునరేషన్‌గా రూ. 64 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇది మలయాళ సినిమా చరిత్రలో ఏ నటుడికి లేని రెమ్యునరేషన్‌. మరోవైపు బహుబలి ఘన విజయం తర్వాత, ప్రభాస్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నటుడు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ.90 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్. KGF రెండో పార్ట్‌ కోసం కన్నడ హీరో యష్‌ సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నహీరో ఇతనే.

South Star’s: రారమ్మని ఊరిస్తున్న బాలీవుడ్.. సౌత్ స్టార్స్ ఆరాటం!

టాలీపుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సర్కార్‌ పారి మాట మూవీ.. తాజాగా విడుదలై హిట్‌ టాక్‌తో ముందుకు వెళ్తుంది. ఈ సినిమా కోసం రూ.80 నుంచి 85 కోట్ల మధ్య తీసుకున్నారని సమాచారం. ఇక తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్‌ ఒక్కో సినిమాకు రూ.70 కోట్లు వసూలు చేయగా.. తారక్‌ రూ.50 కోట్లు.. రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌ ఇద్దరూ ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ట్రెండ్‌ ను బట్టి చూస్తే.. భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నఇండస్ట్రీ దక్షిణ భారతదేశంగా చెప్పుకోచ్చు.