Pooja Hegde: ఫస్ట్‌టైమ్ చీఫ్‌గెస్ట్‌గా హీరోయిన్.. పూజా రేంజ్ ఇది!

మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువని ఎప్పటినుంచో వినిపించే డైలాగే. సినిమాకు కొబ్బరికాయ కొట్టే దగ్గరి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు మేల్ సెలెబ్రిటీలనే గెస్ట్ లుగా..

Pooja Hegde: ఫస్ట్‌టైమ్ చీఫ్‌గెస్ట్‌గా హీరోయిన్.. పూజా రేంజ్ ఇది!

Pooja Hegde

Pooja Hegde: మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువని ఎప్పటినుంచో వినిపించే డైలాగే. సినిమాకు కొబ్బరికాయ కొట్టే దగ్గరి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు మేల్ సెలెబ్రిటీలనే గెస్ట్ లుగా పిలుస్తుంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ కు లీడ్ గెస్ట్ గా అటెండ్ అయింది పూజా హెగ్డే. ప్రెజెంట్ మార్కెట్ లో తన ట్రెండ్ ఎలా ఉందో ఇలా చెప్పకనే చెప్తోంది.

Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

జనరల్ గా ప్రీరిలీజ్ ఫంక్షన్స్ అంటే గెస్ట్ లుగా మనకు కనిపించేది టాప్ హీరోలే. రీసెంట్ ఈవెంట్స్ నే తీసుకుందాం. రొమాంటిక్ మూవీని ప్రభాస్ ప్రమోట్ చేస్తే.. విజయ్ దేవరకొండ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రచ్చ చేశాడు. నాట్యం సినిమాకు మెగాఫ్యామిలీ హీరోలు గట్టి సపోర్ట్ నిస్తే.. మిగిలిన సినిమాలకు మరికొందరు మేల్ స్టార్స్ అండగా నిలిచారు. కానీ ట్రెండ్ మారుస్తూ వరుడు కావలెను సంగీత్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి గ్లామర్ రచ్చ చేసింది పూజా హెగ్డే.

Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా ఇమేజ్ మామూలుగా లేదిప్పుడు. వరుస హిట్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ తో పీక్స్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతులేని స్టార్ డం ఇప్పుడామే సొంతం. అందుకే ఓ వైపు ఆమె సొంత మూవీ ఈవెంట్స్ లో పాల్గొంటూనే.. తానే గెస్ట్ గా మారి ఫంక్షన్స్ లో గ్లామర్ షో చేస్తోంది. లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో బన్నీ కూడా పూజా స్టార్ డం ఏ రేంజో లో ఉందో చెప్పేసారు. అందరి హీరోలకు హిట్స్ ఇస్తూ క్రేజీ స్టార్ అయిపోతున్నవంటూ పూజాను పొగిడేసారు అల్లు అర్జున్.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

ఇప్పటికే సౌత్ టు నార్త్ పూజా స్టార్ డం స్కైను టచ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దుమ్మురేపుతోంది. మళ్లీ మళ్లీ ఆమె కావాలంటూ కొత్త సినిమాల్లో పూజానే రిపీట్ చేస్తున్నారు తెలుగు హీరోలు. అటు బాలీవుడ్ లోనూ ఆమె ఇమేజ్ ఏం తక్కువ లేదు. కాకపోతే గట్టి హిట్ పడాలక్కడ. ఇక ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ బీస్ట్ లాంటి సినిమాలు బంపర్ హిట్ కొట్టాయంటే బుట్టబొమ్మను పట్టుకోవడం ఇప్పట్లో కష్టమే అన్నట్టుంది.