Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్

తాజాగా ఈ హిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్‌ బెంజ్‌ లగ్జరీ కారు కొన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిచింది నిక్కీ తంబోలి. కారుతో, తన తండ్రితో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.............

Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్

Nikki Tamboli

Nikki Tamboli :  ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘తిప్పరా మీసం’, ‘కాంచన 3’ లాంటి సినిమాతో మెప్పించిన నిక్కీ తంబోలి హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ రియాలిటీ గేమ్‌ షో ఖంత్రోన్ కే ఖిలాడీ షోలో నిక్కీ పాల్గొంది.

Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా ఈ హిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్‌ బెంజ్‌ లగ్జరీ కారు కొన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిచింది నిక్కీ తంబోలి. తన తండ్రితో కలిసి కారు వద్ద ఫొటోలకి ఫోజులిచ్చింది. కారు కొన్నందుకు కేక్ కట్ చేసింది, ఆ తర్వాత కార్ కు పూజ చేసింది నిక్కీ. కారుతో, తన తండ్రితో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ”ఎప్పుడు నా ఎదుగుదలలో తోడుగా ఉన్నారు. నేను పడిపోకుండా సపోర్టు ఇచ్చారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పటికి నేను మీ లిటిల్‌ గర్ల్‌నే” అంటూ పోస్ట్ చేసింది. నిక్కీ కొనుగోలు చేసిన ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ధర దాదాపు కోటి రూపాయలు ఉండొచ్చని సమాచారం. నిక్కీ కొత్త కారు కొండంతో నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.