Nivetha Thomas : కిలిమంజారో అధిరోహించిన నివేదా థామస్

తెలుగుతోపాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నివేదా థామస్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరిని ఆశ్చర్యపరిచారు.

Nivetha Thomas : కిలిమంజారో అధిరోహించిన నివేదా థామస్

Nivetha Thomas

Nivetha Thomas :  తెలుగుతోపాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నివేదా థామస్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తునై ఈ పర్వతాన్ని అధిరోహించినట్లుగా థామస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినది. ఈ ప్రాంతంలో గంటల వ్యవధిలో వాతావరణం మారుతుంది.

చదవండి : Nivetha Thomas : పాలు పితికిన నివేదా థామస్, వీడియో వైరల్

చాలామంది పర్వతారోహకులకు ఈ పర్వతం ఎక్కాలని కోరిక ఓ కలగానే మిగిలిపోతుంది. కానీ నివేదా మాత్రం 19,340 అడుగుల పర్వతాన్ని అధిరోహించి తన కల నెరవేర్చుకుంది. నివేదా అభిరుచుల్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. కాగా, కిలిమంజారోను అధిరోహించినప్పటి ఫొటోలను నివేదా సోషల్ మీడియాలో పంచుకుంది.

చదవండి : Nivetha Pethuraj: అందానికే కేరాఫ్ అడ్రస్ ఈ మలయాళ కుట్టీ