Pushpa: సుక్కూ సర్.. నన్ను దత్తత తీసుకోండి..!

పుష్ప సినిమా కోసం చాలా కాలం కష్టపడ్డామని చెప్పిన రష్మిక.. సెకండ్ పార్ట్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నామంది.

Pushpa: సుక్కూ సర్.. నన్ను దత్తత తీసుకోండి..!

Rashmika

Pushpa: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో.. హీరోయిన్ రష్మిక మందన్నా.. క్యూట్ క్యూట్ గా మాట్లాడి ఆకట్టుకుంది. పుష్ప సినిమా కోసం చాలా కాలం కష్టపడ్డామని చెప్పిన రష్మిక.. సెకండ్ పార్ట్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నామంది. సినిమా నిర్మాతలు, దర్శకుడు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపింది.

పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. టీమ్ అంతా చాలా కష్టపడ్డామని.. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని.. కచ్చితంగా అందర్నీ ఎంటర్ టైన్ చేయడం కన్ఫమ్ అని తేల్చి చెప్పిన రష్మిక.. సుకుమార్ గురించి చెప్పిన మాటలు స్పెషల్ గా అట్రాక్ట్ చేశాయి. తాను చాలా కాలంగా పుష్ప సినిమా కోసం తన పేరెంట్స్ ను వదిలి ఉన్నానని చెప్పింది. తనను తన పేరెంట్స్ వది కుదిరితే.. తనను దత్తత తీసుకోవాలని కోరింది. అడాప్షన్ పేపర్స్ తో రావాలంటూ సరదాగా కామెంట్ చేసి అందర్నీ నవ్వించింది.

యాంకర్ సుమ అడగడంతో.. ఓ డైలాగ్ చెప్పి అలరించిన రష్మిక.. ఆ తర్వాత డ్యాన్స్ స్టెప్పుతో కూడా అదరగొట్టింది. సామీ సామీ పాటకు స్టేజ్ పై స్టేప్పేసి క్లాప్స్ కొట్టించింది. ఓవరాల్ గా.. తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. రష్మిక.

Read More:

Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!

Pushpa: తగ్గేదే లే.. అంటూ అదరగొట్టిన అల్లు అర్హ, అల్లు అయాన్

Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!