బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి : రేణు దేశాయ్

  • Published By: bheemraj ,Published On : June 23, 2020 / 06:05 PM IST
బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి : రేణు దేశాయ్

బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయని నటి రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఆమె తాజా ఇంటర్వ్యూలో కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య  గురించి మాట్లాడారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చినప్పుడు నైపుణ్యంతోపాటు దృఢత్వం కూడా ఉండాలని తెలిపారు. సుశాంత్ చాలా తెలివైనవాడు.. కానీ, సున్నితమైన వ్యక్తిత్వం కలిగినవాడని చెప్పారు. 

సుశాంత్ విజయాలు అందుకున్నాడు… స్టార్ గా ఎదిగాడని తెలిపారు. అందరూ బంధుప్రీతి వల్లే మానసిక ఒత్తిడికి గురయ్యాడని అంటున్నారు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ బంధుప్రీతి ఉందని.. అది మనందరికీ తెలుసన్నారు. సినీ కుటుంబం కానప్పుడు.. కేవలం నైపుణ్యం ఉంటే సరిపోదని.. దాంతోపాటు బలంగా ఉండటం నేర్చుకోవాలని సూచించారు. తనను తాను నిరూపించుకోవాలి అనే సంకల్పం ఏర్పరచుకోవాలన్నారు. మన ఇష్ట ప్రకారం కెరీర్ జరుగదని… దానికి దిగులుపడి కూడదని పేర్కొన్నారు. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదని ఆమె పేర్కొన్నారు.

రేణు దేశాయ్ నటిగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు పొందారని తెలిపారు. టాలీవుడ్ లో ఆసక్తికరమైన పాత్రలో నటించే అవకాశం వస్తే చేస్తానని ఇటీవల తెలిపారు. ప్రస్తుతం ఆమె రైతుల జీవితాలు, వారి సమస్యలపై సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని దీనికి అన్నదాత సుఖీభవ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని రోజుల క్రితం రేణు పల్లెటూళ్లకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని గమనించారు.