Heroine Roy Lakshmi : ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్‌

హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలో రాయ్‌లక్ష్మీ గాయపడ్డారు.

Heroine Roy Lakshmi : ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్‌

Roy Laxmi

Heroine Roy Lakshmi escaped from a big accident : హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రమణ మొగిలి డైరెక్షన్‌లో రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలో రాయ్‌లక్ష్మీ గాయపడ్డారు.

‘‘ఫైటర్స్‌తో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో రాయ్‌లక్ష్మీ కాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. చికిత్స తీసుకున్నాక, కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో రాయ్‌లక్ష్మీ పాల్గొంటారు’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇది భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ అని, పెద్ద ప్రమాదం నుంచి రాయ్‌లక్ష్మీ తప్పించుకున్నారని కూడా చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విలన్‌గా ప్రదీప్‌ రావత్, ఓ కీలక పాత్రను సీనియర్‌ నరేశ్‌ పోషిస్తున్నారు.